పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోలీసులు గుర్రాలచే తొక్కించినా బెదరని

హమీదా తయ్యాబ్జీ

(1911- )

బ్రిటిషు బానిస బంధనాల నుండి విముక్తి కోరుకున్న భారతీయులు దృఢసంకల్పంతో ఆ దిశగా ముందుకు సాగారు. పోరుబాటలో దీక్ష చేపట్టారంటే వారిని మార్గం మళ్లించడం ఎంతటి క్రూరత్వానికైనా సాధ్య మయ్యేది కాదు.ప్రభుత్వం ఎంతదారుణాలకు పాల్పడినా ఉద్యమకారులు పోరుబాట తప్ప లేదు . ఈ వైఖరికి పురుషులైనా, స్రీలైనా తేడా కన్పించలేదు భయానక హింసకు కూడ ఏమాత్రం వెరవక మున్ముందుకు సాగిన సాహస మహిళలు జాతీయోద్యమంలో పలువురు దర్శనమిస్తారు. ఆ మహిళలలో చెప్పుకోదగ్గవారు శ్రీమతి హమీదా తయ్యాబ్జీ.

గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన తయ్యాబ్జీ కుటుంబానికి చెందిన హమీదా తయ్యాబ్జీ 1911లో బరోడాలో జన్మించారు. ఆమె సీనియర్‌ కేంబ్రిడ్జిలో విద్యాభ్యాసం గావిస్తున్న సమయంలో తన కుటుంబీకులతోపాటుగా జాతీయోద్యమంలో పాల్గొనేందుకు చదువును మధ్యలో వదిలేశారు. భారత జాతీయ కాంగ్రెస్‌ యువజన సమితిలో ఆమె సభ్యురాలు. తాత అబ్బాస్‌ షంషుద్దిన్‌ తయ్యాబ్జీ, మహాత్మా గాంధీల రాజకీయ సిద్ధాంతాల పట్ల ప్రభావితులయ్యారు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన అన్ని ప్రధాన సంఘటనలలో ఆమె పాల్గొన్నారు.

105