పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీజీ ఆధ్వర్యంలో ' నిఖా ' చేసుకున్న

ఫాతిమా బేగం

స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు కోరుకున్న ప్రజలు వివక్షతను ఏమాత్రం సహించరు. మహత్తరమైన స్వేచ్ఛా,సమానత్వాల కోసం నడుం కట్టిన యోధులు సుఖ,సంపదలను లెక్కచేయరు. లక్ష్యసాధాన పరమావధిగా భావించిన వారు ఆ మార్గం తప్ప అందుకు అడ్డం వచ్చే ప్రతిదాన్ని త్యజిస్తారు. ఆ కార్యాచరణకు ప్రతిరూపంగా నిలుస్తారు శ్రీమతి ఫాతిమా బేగం.

దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో మహాత్మాగాంధీ తోపాటుగా పాల్గొని, అక్కడున్న లక్షలాది రూపాయలను ఆర్జించిపెట్టే వ్యాపారాన్ని వదులుకుని, గాంధీజీ తోపాటుగా భారతదేశం విచ్చేసిన కుటుంబ సభ్యురాలు ఫాతిమా బేగం. ఆమె తండ్రి ఇమామ్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ దక్షిణాఫ్రికాలో ప్రఖ్యాత అరేబియా గుర్రాల వ్యాపారి. దక్షిణాఫ్రికాలో సాగుతున్న వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఇమామ్‌ ఖాదిర్‌ గాంధీజీకి క్రియాశీలక సహకారం అందించారు. ఆ క్రమంలో అక్కడున్న సర్వసంపదలను త్యజించి అతి సామాన్య ఉద్యమకారునిగా కుటుంబంతో సహా ఆయన భారత దేశం వచ్చారు.బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్నవిముక్తి పోరాటంలో భాగస్వామ్యం వహించేందుకు సర్వసంపదలు వదులుకుని గాంధీజీ వెంట నడిచారు.

99