పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


అని పిలుస్తున్నందున, తనను తల్లిగా పరిగణించి గౌరవిస్తున్నందున తన బిడ్డల ఎదుట తాను పర్దా ధరించాల్సిన అవసరం లేదాంటూ పర్దారహితంగా బహిరంగ సభలలో ఆమె ప్రసంగించారు.

అనారోగ్యం ఆటంకాలు కల్పిసున్నా లెక్క చేయ కుండా విముక్తి పోరాటంలో చురుకైన పాత్ర నిర్వహించిన అబాది బానో 1922 సెప్టెంబరులో పంజాబు పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఓ సభలో మ్లాడుతూ భారతదేశపు కుక్కలు, పిల్లులు కూడ బానిసత్వపు సంకెళ్ళలో బందీలుగా ఉండరాదాన్నది నా అభిమతం, అని ఆమె గర్జించారు. ప్రతి ఒక్కరూ ఖద్దరును ధారించాలని, ఖద్దరు ధారణను ప్రోత్సహించాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆమె ఉద్భోదించారు. అనారోగ్యం వలన గొంతు పెగలకున్నా ఎంతో శ్రమతో ఆమె చేసిన ప్రసంగాలు పంజాబ్‌ ప్రజలను ఉత్తేజితుల్నిచేశాయి.

ఈ రకంగా ఆమె దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పరాయి పాలకుల దుష్టచర్య లను వ్యతిరేకిస్తూ, ప్రజలను ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమాలలో ప్రవేశించాల్సిందిగా ఉద్భోదించారు. ఆమె నిబద్దత, నిరాడంబరత, స్వచ్ఛమైన వ్యక్తిత్వం ప్రజలను కట్టిపడేయసాగాయి. ఆ కారణంగా ఆబాది బానో బేగంను ప్రమాదాకర విద్రోహి గా బ్రిటిష్‌ ప్రభుత్వం నివేదికలు పేర్కొన్నాయి. అబాది బానో బేగం కుటుంబసభ్యులందర్ని ప్రభుత్వ వ్యతిరేకులుగా ప్రభుత్వాధినేతలు పరిగణంచారు. ఈ పరిసితిని బ్టి ఆమె ఏ స్థాయిలో బ్రిటిషు ప్రభుత్వం మీద పోరాటం సాగించారో తెలుస్తుంది.

ఈ విధంగా చివరిశ్వాస వరకు స్వేచ్ఛాయుతమైన స్వతంత్ర భారతాన్నికాంక్షిస్తూ, మహాత్ముని మార్గంలో పోరుబాటన నడిచిన శ్రీమతి ఆబాది బానో అబ్దుల్‌ అలీ బేగం 1924 నవంబరు 13న ఢిల్లీలో అలీ సోదరులు, మహాత్మా గాంధీ తదితర ప్రముఖుల సమక్షంలో ప్రశాంతంగా కన్నుమూశారు.

ఆ రోజున యావత్తు భారత దేశం కన్నీటి సముద్రమైంది.

                          * * *

నా భర్త సహచరులంతా జైళ్ళకు వెళ్ళారు. నా భర్త మాత్రం ఇంత వరకు స్వేచ్ఛగా ఉండటం పట్ల మాకు బాధగా ఉంది. - బేగం ఖుర్షీద్‌ ఖాfiజా 98