పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు

|, Edited by Nagendra.K. Singh, APHPC, New Delhi, 2001, Page. 4) ఖిలాఫత్-సహాయనిరాకరణ ఉద్యమం సమయంలో ఆమె వృధ్యాప్యం వలన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమె శరీరం ప్రయాణాలకు ఏమాత్రం సహకరించటం లేదు. ఆ పరిస్థితు లలో కూడ అబాది బానో ప్రజలలోకి వచ్చారు. స్వచ్చందంగా సహయ నిరాకరణ ఉద్యమ బాధ్యతలను చేపట్టారు. ఈ ఉద్యమాల నిర్వహణకు అవసరమైన నిధులను ప్రముఖులు, ప్రజల నుండి సమకూర్చటంలో అద్భుతమైన పాత్రను నిర్వహించారు. ఖిలాఫత్‌ నిధుల సేకరణకు కోడలు అంజాది బేగంను వెంటపెట్టుకుని విస్త్రుతంగా పర్యటించారు. ఆ నిధులను మహాత్మాగాంధీ జరిపిన దేశ పర్య టనకు, ఉద్యమ కార్యక్రమాల నిర్వహణకు అందచేశారు. ఈ సందర్భంగా ఆమె వందలాది సభలు, సమావేశాలలో పాల్గొని ప్రసంగించారు. ఆంగ్ల పత్రికలలో వచ్చే ఉద్యమ సమాచారాన్ని, ప్రభుత్వం తీరుతెన్నులను కూడ ఆమె సహచరుల నుండి గ్రహిస్తూ, ప్రజల మీద పాలకవర్గాల కిరాతక చర్యలు పెరిగే కొద్దీ, నిప్పులు చెరిగే ఉపన్యాసాలతో ప్రభుత్వం మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఆబాది బానో రాజకీయ రంగాన మాత్రమే కాకుండ సామాజిక రంగంలో కూడ తనదైన భాగస్వామ్యాన్నిఅందించారు.1921లో జరిగిన అఖిల భారత మహిళల సమావేశానికి అధ్యాక్షత వహించి, మహిళా కార్యకర్తలకు మార్గదార్శకత్వం వహించారు. స్వదేశీ ఉద్యమాన్ని పటిపటిష్టపర్చటంలో, మతసామరస్యం కాపాడటంలో మహిళలు ప్రదాన పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కస్తూరిబా గాంధీ, బేగం హసరత్ మోహాని, సరోజిని నాయుడు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. బ్రిటిష్‌ నియంతృత్వం నుండి విముక్తి సాధించాలంటే హిందూ-ముస్లింల ఐక్యత అనివార్యమని నమ్మిన ఆమె చివరిశ్వాస వరకు ఆ దిశగా కృషి సల్పారు. ఐక్యంగా ఉండమని మనకు పలు అనుభవాలు నేర్పుతున్నాయి, ఈ దేశంలోని హిందూ- ముస్లిం- శిక్కు- ఈశాయి ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించనట్లయితే మన లక్ష్యం ఏనాటికి సిద్దించజాలదు అని ఆమె ప్రజలను హెచ్చరించారు.

జాతీయోద్యమ కార్యక్రమాలలో మహిళలు అధికంగా పాల్గొనాలని ఆబాది బానో ఉద్భోదించారు. స్వయంగా ఉద్యమంలో పాల్గొనలేక పోయినా ఉద్యమిస్తున్న భర, పిల్లలను ప్రోత్సహించాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. జాతీయోద్యమకారులంతా తనను అమ్మా

97