Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

72 సయ్యద్ నశీర్ అహమ్మద్

much in the style of the ordinary preaching of the Farazi Moulvies..") వివరించాడు.
⁠ఈ విషయం ఇలా వుండగా, ఫరాజీలు ప్రజలలో రగిల్చిన బ్రిటీష్ వ్యతిరేక జ్వాలల ప్రభావం వలన ఢాకా, ఫరీద్ పూర్, దీనాపూర్, బత్రాగంజ్, తదితర ప్రాంతాలను తిరుగుబాటుకు సారవంతమైన భూములుగా కంపెనీ పాలకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆ ప్రాంతాలలో ఫరాజీలు, తిరుగుబాటు వీరులతో చేతులు కలిపారు. విషయాన్ని ఆనాడు ఆధికారులకు వచ్చిన పలు ఆకాశరామన్న ఉత్తరాలు, నివేదికులు నిర్ధారణ చేస్తున్నాయి. ఈ తిరుగుబాటులలో దూదు మియా అల్లుడు కూడ పాల్గొనబోతున్నాడని, అందువలన దూదు మియా అనుచరులను, ఆయన అల్లుడిని ముందుగానే అరెస్టు చేయాల్సిందిగా కోరటం జరిగింది. ఫరీద్ పూర్ జిల్లాకు దూదు మియా బంధువు, జమీందారు గురీబ్ హస్ చౌదరీ తన భవనంలో తుపాకులను తయారు చేసున్నాడనీ, బ్రిటీషర్ల మీద దాడులు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయుధాలు తయారీ ముమ్మరంగా సాగుతోందనీ, తిరుగుబాటు వీరులకు ఆయుధాలు అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మోలికొండ నివాసులైన ఆంగ్లేయులు ప్రభుత్వానికి రాసిన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా ఆంగ్లేయుల జీవితాలకు ప్రమాదం ముంచుకు రావచ్చును, కనుక తగిన రక్షణ ఏర్పాట్లు చేయాల్సిందిగా లేఖలో కంపెనీ పాలకులను కోరారు.
⁠ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి ఒకరు ఆనాటి పరిస్థితుల మీద ప్రభుత్వానికి ఒక నివేదిక పంపుతూ, ఫరాజీలు చీమల పుట్టలాగ పుట్టుకొస్తున్నారని (..a number not less than the swarms of ants..) తెలిపాడు. ఈ లేఖలు, నివేదికలను బట్టి ఆనాడు ఫరాజీల, ఫరాజీ నాయకుల మీద కంపెనీ పాలకులు, జమీందారులు, ఆంగ్లేయులు ఎంతటి నిఘా వుంచారో అర్థం అవుతుంది. ఫరాజీలు, ఫరాజీ సానుభూతిపరులు, మద్దతుదారుల మీద ఎంతటి నిఘా, నిర్బంధాలున్నా, దూదు మియాను చెరసాలలో కట్టడి చేసినా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్య్ర సమరంలో ఫరాజీలు తమదైన పాత్రను నిర్వహించారు.
దూదు మియా కన్నుమూత
⁠‘... నిరుపేద చేనేత పనివారల కుటుంబంలో జన్మించి, పీడితుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అతిసాదా సీదా జీవితం గడుపుతూ, స్పష్టమైన సామాజిక, రాజకీయ తాత్త్విక ఆలోచనా సంపదతో, అపూర్వ ధైర్య సాహసాలతో ఆయన జరిపిన పోరాటాలు ఆయనను పేదవర్గాల ప్రియతమ పితామహునిగా, నేతగా ఆయా వర్గాల ప్రజల హృదయాలలో నిలిచిపోయేట్టుగా చేసాయి...', అంటూ ఆంగ్ల రచయిత డాక్టర్ జేమ్స్ దూదు మియాను శ్లాఘించాడు. జైలు నుండి విడుదల తరువాత ఫరీదా్పూర్ వదిలేసి ఢాకాను స్థిరనివాసం చేసుకున్నారు. అప్పటి నుండి దూదు మియా అత్యధిక సమయాన్ని ధార్మిక విషయాలకు కేటాయించారు. ప్రజలకు '...ప్రమాదకర సిద్ధాంతాలు...' బోధిస్తున్నాడని, '... చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తి...' గా బ్రిటీష్ పాలకులచే దూషించబడిన దూదు మియా, ఫరాజీల ధార్మిక, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసారు. ఫరాజీల