71 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
విఫలమైనప్పటికీ, పట్టు వదలని విక్రమార్కునిలా దూదు మియాకు వ్యతిరేకంగా మళ్ళీ
మళ్ళీ శత్రువర్గాన్ని సంఘటితం చేయసాగాడు.
చివరకు 1857 ప్రారంభంలో సరికొత్త అరోపణలతో దూదు మియాను డన్లప్
అనుచరవర్గం మరోసారి అరెస్టు చేయించింది. ఈ కేసు విచారణ ఢాకాలోని న్యాయస్థానంలో
జరిగింది. పోలీసు, న్యాయవ్యవస్థ మిలాఖత్ కావటంతో, కంపెనీ పాలకుల సలహా మేరకు,
సరైన సాక్ష్యాధారాలు లేకున్నా దూదు మియాకు 14 సంవత్సరాల శిక్షను విధించారు. ఈ
తీర్పు మీద ఫరాజీలు అప్పీల్ చేసుకున్నారు. ఉన్నత న్యాయస్థానం దూదు మియాను
నిర్దోషిగా నిర్ణయించి, కేసును కొట్టివేసి విడుదలకు ఆదేశించింది. అయితే విడుదల ఆదేశాలు
అమలు జరుగలేదు. ఆ సమయంలో ప్రథమ స్వాతంత్య్ర్య సమరజ్వాలలు దేశమంతటా
విస్తరిస్తున్నందున విడుదల చేసినట్లే చేసి, మరో కేసు బనాయించి జైలులో బంధించారు.
ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో ఫరాజీలు
దూదు మియాను బంధించినప్పటికీ ఆంగ్లేయులు ఏమి సాధించ లేకపోయారు.
బ్రిటీష్ అధికారుల పట్ల, బ్రిటీష్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత సంతరించుకున్న ఫరాజీలు
1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా తమదైన పాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫరాజీల వ్యతిరేకతను గ్రహించిన ఆంగ్లేయాధికారులు వారిని పెద్ద సంఖ్యలో
నిర్బంధించారు. భారతదేశమంతటా తిరుగుబాట్లు జరుగుతున్న సమయంలో దూదు
మియాను విడుదల చేయటం అత్యంత ప్రమాదకరమని భావించిన కంపెనీ పాలకులు,
ఆయనను ఒకటిన్నర సంవత్సరం పాటు నిర్బంధించి, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం
ముగిసిన తరువాత మాత్రమే విడుదల చేయడానికి సాహసించగలిగారు.
దూదు మియా నిర్బంధంలో వున్నప్పటికీ, ఆయన ప్రబోధించిన బ్రిటీష్ వ్యతిరేకతను
అణువణువునా నింపుకున్న ఫరాజీలు ప్రథమ స్వాతంత్ర్య సమర వీరులతో చేతులు కలిపి
పలు చోట్ల కంపెనీ బలగాల మీద తిరగబడ్డారు. ఈ విషయాన్ని ఆ నాటి బ్రిటీష్ అధికారులు
రాసిన నివేదికలలో, ప్రభుత్వ మద్దతుదారులు ఆధికారులకు రాసిన లేఖలలో, ఫిర్యాదులలో
పేర్కొన్నారు. ఢాకాకు చెందిన గైబుల్లా అనునతడు అధికారులకు రాసిన లేఖలో తిరుగుబాటు
సిపాయిలు, ఫరాజీ మౌల్వీలు కలసి కుట్రలు పన్నుతున్నారని ("..that that he had knowl-
edge of a secret meeting between two Hindusthanis and some of the Farazi
Khalifas ..., they might be in league with the sepoys..") పేర్కొన్నాడు. బ్రిటీష్ సైన్యంలోని
స్వదేశీ సైనికులను తమతో కలిసి రమ్మంటూ, కంపెనీ పాలకులు అధికారుల మీద
తిరగబడమంటూ ఫరాజీలు లేఖలు రాసారని ఫరీద్ పూర్ మేజిస్ట్రేట్ ఉన్నతాధికారులకు
పంపిన నివేదికలో వివరించాడు. ఒక పాఠశాల నుండి ఫరాజీలు తమ పిల్లలందరిని
ముకుమ్మడిగా తీసుకొని వెళ్ళిపోయారని, ఈ పరిస్థితి చూస్తే, ఫరాజీలు పెద్ద ఎత్తున
తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని అనిపిస్తుందని, మథురాపూర్ ప్రభుత్వ పాఠశాల
ఉపాధ్యాయుడొకడు అధికారులకు రాసిన లేఖలో అనుమానం వ్యక్తం చేసాడు.
జూలైలో జెస్సోర్ జిల్లా మెజిస్ట్రేట్, నాడియా డివిజన్ కమీషనర్కు లేఖ వ్రాస్తూ, ఫరాజీ
నాయకుల వేషధారణ గల మౌల్వీలు, ప్రజలను తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నారని ("..very
1857