Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 66

⁠ఈ దాడులు మతాతీతంగా జరిగాయి. గ్రామీణ ప్రజలకు, ఫరాజీలకు శత్రువుగా పరిగణించిన ప్రతి కుటుంబం మీద దాడి జరిగింది. దాడులలో ఫరాజీలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. (".. even they kidnapped and plundred such Muhammedans when they stood in their way. Muhammedans of diffrent persuations were not only persecuted by them but some times cruelly murdered.."- JUDICIAL PRO- CEEDINGS 16TH April 1839, - VWAHABI AND FA RAZI REBELS OF BENGAL) ఫరీదా్పూర్ మేజిస్ట్రేట్ ఈ తిరుగుబాటు గురించి నివేదిక రాస్తూ, ఈ తిరుగుబాటు 1831లో వహాబీలు టిటూ మీర్ నాయకత్వంలో జరిపిన బరాసత్ రైతాంగ తిరుగుబాటును పోలి ఉన్నదని పేర్కొన్నాడు. ఆ ఆంగ్ల అధికారి వివరణల ద్వారా ఈ తిరుగుబాటు స్వభావ, స్వరూపాలను అర్ధంచేసుకోవచ్చు. ఆనాడు బరాసత్ తిరుగుబాటు విజయంతో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వహాబీల మాదిరిగానే షిబ్చూర్ విజయంతో ఫరాజీలకు తిరుగులేకుండా పోయింది.
⁠దూదు మియా మార్గదర్శకంలో ప్రారంభమైన ఫరాజీల తిరుగుబాటు క్రమక్రమంగా బలం పుంజుకుంది. పలు ప్రాంతాలలో ఫరాజీలు ప్రతిఘటనలకు పూనుకున్నారు. ఈ ప్రతిఘటనలు కాలం గడిచే కొద్ది రైతాంగ తిరుగుబాట్లుగా రూపు దిద్దుకొసాగాయి. ఈ మేరకు అక్రమ వసూళ్ళను వ్యతిరేకిస్తూ పోరుబాటన నడుస్తున్న రైతులకు ఇండిగో ప్లాంటర్ల (నీలిమందు ఫ్యాక్టరీల యజమానులు) రూపంలో మరొక సమస్య వచ్చి పడింది. గ్రామీణ రైతుల భూములను తమ గుప్పెట బిగించుకుని తమ ఇష్టానుసారంగా నీలిమందు పంటను పండించాలని, తాము నిర్దేశించిన విధంగా రైతులు నడుచుకోవాలని, కాదూ కూడదంటే ఆ భూములలో పండే పంటలో ప్రధాన భాగం తమకు సంక్రమింపచేయాలని రైతులను పీడించటం ప్రారంభించారు. జమీందారుల, కంపెనీ అధికారులు, వడ్డీవ్యాపారుల దోపిడికి గురవుతూ జీవచ్ఛవాల్లా బ్రతుకులీడ్చుతూ, అనునిత్యం అణచివేతకు, పీడనకు గురవుతున్న గ్రామీణులకు, ఇండిగో ప్లాంటర్ల చర్యలు ప్రాణాంతకమయ్యాయి. ఈ పరిస్థితులను ఫరాజీలు వ్యతిరేకించారు. ప్లాంటర్ల పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, ఫరాజీలు రైతుల పక్షాన నిలబడటంతోనే ఇండిగో ప్లాంటర్లు కక్షబూనారు. ఈ వ్యతిరేకతను ఆదిలోనే అణిచివేయాలని నిర్ణయించుకున్న ప్లాంటర్లు, ఫరాజీలను తమ ప్రథమ శత్రువులుగా పరిగణించి ఆ దిశగా పావులను కదిపారు.
⁠1837లోనే తూర్పు బెంగాల్ ప్రాంతంలో వందల ఎకరాల భూమిని తన ఆధిపత్యం క్రింద ఉంచుకున్న ప్రముఖ ప్లాంటర్ డన్లప్ మీద ఫరాజీలు దాడికి ప్రయత్నించారు. పలు గ్రామాల పంట భూముల మీద అధిపత్యం చలాయిస్తున్న డన్లప్ అతి కిరాతంగా వ్యవహరిస్తూ, రైతులచే వెట్టిచాకిరీ చేయించసాగాడు. ఈ చాకిరీని, ఆధిపత్యాన్ని నిరాకరించిన రైతులను రాచి రంపాన పెట్టసాగాడు. దూదు మియా ఫరాజీల నాయకత్వం చేపట్టగానే ఫరాజీల నుండి రానున్న ప్రమాదాన్ని డన్ లప్ పసిగట్టాడు. అందుకు తగినట్టుగానే డన్లప్ చర్యలను ఎలాగైనా సరే అడ్డుకోవాలని ఫరాజీలు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి అనేక ఫ్యాక్టరీలు, ఎస్టేట్లు గల సంపన్నుడైన డన్లప్ కార్యకలాపాలకు ఫరాజీలు అడ్డునిలువ సాగారు. అణగిమణిగి పడివున్న రైతులు తనని వ్యతిరేకించటం, ఆ ఆదేశాలను బడుగు