Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 62

మీదనే పూర్తిగా దృష్టినిల్పారు. ఫరాజీల సంఖ్యను పెంచేందుకు కృషిని తీవ్రతరం చేసారు. అందరికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపసాగారు. అణచివేతను, వీడనను వ్యతిరేకించినందున, శుద్ధ ఇస్లాంను, సమానత్వంను బోధించినందున, తూర్పు బెంగాల్ అంతటా ఆయన ప్రవచనాలు బాగా విస్తరించాయి. పీడిత ప్రజానీకం, రైతాంగం ఆయనను తండ్రిగా భావించారు. గౌరవించారు. ఈవిషయాన్ని డాక్టర్ జేమ్స్".. his pure and simple life dedicated to the cause of oppressed, clarity of his social philosophy, his uncomprising and gentle courage made him the beloved idol of the poor who looked upon him as their father...", అని వివరించారు.
ఈ విధంగా అతి సామాన్యమైన పేద చేనేత పనివారల కుటుంబంలో జన్మించి, అత్యున్నత స్థాయి ధార్మిక నాయకునిగా, గ్రామీణ పేదల రక్షకునిగా, అణచివేతకు, అహంకారపూరిత పెత్తనానికి, దోపిడీకి బద్ద విరోధిగా తనదైన పాత్రను హాజీ షరియతుల్లా నిర్వహించారు. శతాబ్దం పాటు తూర్పు బెంగాల్ అంతటా ఆధ్యాత్మిక, సాంఘిక రంగాలలో ప్రభావం చూపిన ఫరాజీ సంప్రదాయాల స్వరూప స్వభావాలను ఆయన తీర్చిదిద్దారు. బెంగాల్న సుమారు అర్ధశతాబ్దిపాటు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలకు నిలయంగా మార్చిన రైతాంగ తిరుగుబాట్లకు జన్మనిచ్చిన ఫరాజీల ఉద్యమాన్ని పటిష్టంగా నిర్మించి, రానున్న రోజులలో ఫిరంగీలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ మహానాయకుడు, తన తరువాత తరాలకు మహత్తర పోరాటాల వారసత్వాన్ని వదలి 1840లో కన్నుమూసారు.
తండ్రిని మించిన తనయుడు దూదు మియా
చరిత్ర సృష్టించిన ఫరాజీ ఉద్యమానికి ఉన్నత దశ మాత్రమే కాకుండా మహత్తర దిశను కూడా నిర్దేశించి ఫరాజీలను పోరాట మార్గాన నడిపించిన మహాసేనాని దూదు మియా, ఫరాజీ ఉద్యమ నిర్మాత హజీ షరియతుల్లా పుత్రుడు. ఆయన అసలు పేరు మహమ్మద్ మోసిన్ 1819లో జన్మించిన దూదు మియా తండ్రిలాగే చిన్ననాటనే మక్కాకు వెళ్ళి వచ్చారు. ధార్మిక చింతనతో పాటుగా సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితుల పట్ల చక్కని అవగాహన సంపాదించుకున్నారు. రెండు పదులు దాటని వయస్సులో దూదు మియా ఫరాజీ ఉద్యమ నాయకునిగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన నాయకత్వం స్వీకరించేసరికి, ఫరాజీలు కేవలం ధార్మిక అంశాలనే కాకుండా అణచివేతను ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఆ పరిస్థితులలో నాయకత్వం చేపట్టిన దూదు మియా అద్భుతమైన కార్యదక్షతతో, నిర్మాణ కౌశల్యంతో, త్యాగనిరతితో తండ్రిని మించిన తనయుడిగా ఖ్యాతిగాంచారు. హాజి షరియతుల్లా ప్రధానంగా ధార్మిక విషయాల మీద దృష్టి సారించగా, అందుకు భిన్నంగా దూదు మియా ఆనాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద దృష్టి నిలిపారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో తండ్రి ప్రారంభించిన ఫరాజీ ఉద్యమాన్ని తీర్చిదిద్ది రాజకీయంగా మలుపు తిప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత S.P. RAY తన గ్రంథం Bharater Krishak Bidroh Ganatantrik Sangram లో "..Under Dudu Miah political and economical programme was combined. It brought a qualitative change in the character of movement... అని పేర్కొన్నారు. ఆయన తన అనుచరులను సమరశీల కార్యకర్తలుగా "