Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 44

విప్లవ యోధుడు ఇనాయత్ అలీ
⁠వహాబీల ఉద్యమ దిశను మాత్రమే మార్చటం కాకుండా, మహర్దశ కలుగచేసిన నాయకులలో ప్రముఖులు మౌల్వీ ఇనాయత్ అలీ. బీహార్ రాష్ట్రం పాట్నా నగరంలోని, షాదీఖ్పూర్లో ఆయన జన్మించారు. విద్యార్థి దశలోనే సయ్యద్ అహమ్మద్ బరేల్వి ప్రభావానికి లోనయ్యారు. ఆ తరువాత మౌల్వీ విలాయత్ అలీ మార్గనిర్దేశకంలో ఉద్యమ కార్యక్రమాలలో ప్రవేశించారు. సయ్యద్ అహమ్మద్ బరేల్వి స్వయంగా ఆయనను తన ప్రతినిధిగా ఆ తరువాత సయ్యద్ బరేల్వితో కలసి 1825లో ఆయన ఆఫ్ఘనిస్తాన్ కు తరలి వెళ్ళారు. 1829లో వహాబీ ఉద్యమాన్ని పునరుద్ధరించి, వ్యాప్తి చేయడానికి మౌల్వీ బెంగాల్లో మీర్ నిస్సార్ అలీలాంటి పోరాట వీరుల త్యాగాల నేపధ్యం ఉన్నందున అచిరకాలంలోనే అక్కడ ఆయనకు అపార అనుచరవర్గం ఏర్పడింది.
⁠బెంగాల్ లో ఆయన నిర్వహించిన కార్యక్రమాల సరళిని దృష్టిలో ఉంచుకుని మౌల్వీ విలాయత్ అలీ 1839లో ఆయనను తమ ప్రధాన స్థావరమైన సిత్నాకు పంపారు. పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్ లో సాగిన పోరాటాలలో పాల్గొని ఆయన బాగా రాటుతేలారు. ఆయన కార్యక్రమాల నిర్వహణా దక్షతను గమనించి, ప్రమాదం పసిగట్టిన బ్రిటీష్ అధికారులు ఆయన సంచారం మీద నిషేధం విధించి, పాట్నాకు తరలించారు. నాలుగు సంవత్సరాలపాటు పాట్నా విడిచి ఎక్కడకూ వెళ్ళరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అరెస్టు చేసి పదివేల రూపాయల పూచీకత్తు మీద విడుదల చేసింది. ఆయన ఆ ఆంక్షలను ఖాతరు చేయలేదు. బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలతో పాటుగా వహాబీ ఉద్యమ విస్తరణకు నిరంతరం కృషి సాగించారు. ఇనాయత్ అలీ మరోమారు బెంగాల్ వెళ్ళగా ఆయన మీద నిఘా ఉంచిన ప్రభుత్వం బెంగాల్ నుండి బహిష్కరించి, పాట్నాకు తరలించింది. మళ్ళీ పాట్నాను వీడరాదన్న ఆంక్షలు విధిస్తూ, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే, ఈసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. బ్రిటీష్ వ్యతిరేక పోరాటమే ఊపిరిగా భావించిన మౌల్వీ ఆ ఆంక్షలను తుంగలో తొక్కి అధికారుల కళ్ళు గప్పి, వాయవ్య సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ మళ్ళీ పోరాట కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ బ్రిటీష్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆ సమయంలో ఆయన మార్గనిర్దేశకుడు, అగ్రజుడైన మౌల్వీ విలాయత్ అలీ మరణించారు. అన్న మరణం ఇనాయతుల్లాను బాగా కృంగదీసింది. వహాబీ ఉద్యమ బాధ్యతలన్నీ మౌల్వీ ఇనాయత్ అలీ భుజస్కంధాల మీద పడ్డాయి. ఆయన వహాబీ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేసేందుకు పూనుకున్నారు. సయ్యద్ అహమ్మద్ బరేల్వి రూపకల్పన చేసిన ఖలిఫా పద్ధతికి మెరుగులుదిద్ది, మరింత ప్రజాస్వామికం చేసారు. నిబద్ధత గల నేతలతో కమిటీలు ఏర్పరచి, బాధ్యతలు అప్పగించారు. కమిటీల అభిప్రాయాల మేరకు ఖలీఫా తగు నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది.
⁠ఈ రకంగా వహాబీ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ వ్యక్తులైన సయ్యద్ మహమ్మద్ హుసైన్, అక్బర్ అలీ, సయిజ్ అలీ, యయ్య అలీ, వాజల్ హబ్, ముస్తాక్ అలీ, అహమ్మదుల్లా, అబ్దుల్ రహీం, ముబారక్ అలీ, ఫర్హత్ హుసైన్, మహమ్మద్ ఇబ్రహీం అబ్దుల్లా, అబ్దుల్