సయ్యద్ నశీర్ అహమ్మద్ 38
వహాబీలే తమ మసీదును తాము తగులబెట్టుకున్నారని, జమీందారు తప్పులేదని రిపోర్టు
తయారు చేయించుకున్నాడు. ఈ సంఘటనలో మీర్ నిస్సార్ అలీ, ఆయన ప్రధాన
సలహాదారుడు గులాం మాసూంలు జమీందారుకు వ్యతిరేకంగా రైతులను, ప్రజలను
రెచ్చగొట్టారని నివేదికలో రాయించాడు. ఈ వ్యవహారాన్ని వహాబీలు జాయింట్ మేజిస్ట్రేటు
దృష్టికి తీసుకువెళ్ళారు. ఆ అధికారి జమీందారుతో రాజీపడమని వహాబీలకు సలహా ఇచ్చాడు.
వహాబీలు నిరాకరించారు. తన సూచనను అంగీకరించలేదని, జమీందారుకు అనుకూల
సాక్ష్యాలతో నివేదిక నమోదు చేసిన, ఆ అధికారి వహాబీల ఫిర్యాదును కొట్టివేసాడు. ఈ
వ్యవహారాన్ని అంతటితో వదలరాదనుకున్న వహాబీలు కలకత్తాలోని కమీషనర్ వద్ద అప్పీల్
చేసారు. వహాబీల పక్షాన మొహమ్మద్ మసూద్ అను న్యాయవాది కేసును నడిపాడు. వహాబీలకు
న్యాయం జరుగలేదు. జమీందారు మరింత రెచ్చిపోయాడు. నిస్సహాయులైన గ్రామ రైతుల
మీద పగబట్టాడు. ఈ సంఘటనలో జమీందారుకు వ్యతిరేకంగా నిలిచిన పేద వహాబీలను,
రైతులను వేధింపులకు, హింసలకు గురిచేసాడు. పంట భాగం తక్షణమే కట్టాలని
నిర్బంధించాడు. గృహల మీద దాడులు చేసి ఏదుంటే అది ఎత్తుకు రమ్మని అనుచరులకు
ఆదేశాలిచ్చి కిరాతకంగా వ్యవహరించాడు. వహాబీలను నిర్బంధించి దస్తావేజుల మీద
బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు.
తిరగబడ్డ వహాబీలు
జమీందారు ఆగడాలు మితిమీరటంతో వహాబీలు చట్టాన్ని తమ చేతుల్లోకి
తీసుకున్నారు. తమను ఘోరంగా అవమానపర్చిన జమీందారు మీద ప్రతీకారం
తీర్చుకునేందుకు సమాయత్తమయ్యారు. గ్రామీణులకు మీర్ నిస్సార్ ఆలీ నాయకత్వం
వహించాడు. ఆయన గ్రామానికి చెందిన రైతులు, మైజుద్దీన్ బిస్వాస్, చేనేత పనివారైన
బలాయ్ జులాహ, డాకూ కారీగార్, దీమ్ కారిగార్, ఖాదార్ బక్ష్ కారీగార్, పూజత్ మల్లిక్
తదితరులు వెంట నడిచారు. ఈ సందర్భంగా 1763-1800 నాటి ఫకీర్ల పోరాటంలో
పాల్గొన్న నేతల వారసుడైన ఫకీర్ కురజాన్ షా తన అనుచరులతో మీర్ నిస్సార్ అలీతో
చేతులు కలిపారు. వహబీలు నర్కేల్ ్బరియా గ్రామం చేరుకున్నారు. సంప్రదాయక
ఆయుధాలను సమకూర్చుకుని, పోరుకు సిద్ధమయ్యారు. 1831 నవంబర్ 6 న సుమారు
500 మంది పూర్వా గ్రామం మీద దాడి చేసారు. ఈ దాడి విషయాన్ని పసిగట్టిన జమీందారు,
ధనిక సంపన్న వర్గాలు గ్రామం విడిచి పారిపోయారు. జమీందారు దొరకకపోవటంతో
ఆగ్రహావేశాలకు లోనైన వహాబీలు విజ్ఞత కోల్పోయారు. అనుచిత చర్యలకు పాల్పడ్డారు.
వహాబీలకు అడ్డులేకుండా పోయింది. ప్రతిఘటన లేని ఈ విజయం వహాబీలను
ఉత్తేజపరిచింది.
కంపెనీ పాలకుల, అధికారుల నిరంకుశ పాలన, జమీందారుల దాష్టీకాలతో
విసిగిపోయిన ప్రజలు తిరగబడిన వహాబీల వెంట సాగేందుకు ముందుకు వచ్చారు. పూర్వా
గ్రామం తరువాత నాడియా జిల్లాలోని లోగహట్టీ గ్రామం మీద దాడి జరిగింది. ఆ గ్రామానికి
చెందిన శ్రీ హరదేవరాయులు వహాబీలను ఎదుర్కొన్నాడు. ఆ పోరులోనూ వహాబీలదే పై