పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 22 కంపెనీకి రెవిన్యూ చెల్లించ వద్దని విజ్ఞప్తి చేసి వెళ్ళిపోయేవారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వసూచేసిన రెవిన్యూ, ఫకీర్ల పాలుకాకుండ కాపాడుకునేందుకు తమ అధికారులను,గుమస్తాలను, జమీందారులను కచ్చేరీల నుండి పారిపొమ్మని కూడ పాలకులు సలహాలిచ్చిన సంఘటలను బట్టీ, కచ్చేరీల మీద ఫకీర్ల దాడి ఎంత బలంగా ఉండేదో ఊహించవచ్చు.కంపెనీ నియమించిన జమీందారులు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నందున ప్రతీకార చర్యగా ఫకీర్లు జమీందారుల పట్ల ఏ మాత్రం కనికరం చూపేవారు కారు. చివరకు భారీ బలగాలతో భద్రతను ఏర్పాటుచేసిన కంపెనీ కర్మాగారాల మీదకూడ ధైర్యసాహసాలతో మజ్నూ షా దాళాలు దాడులు జరిపి విజయం సాధించి చరిత్ర సృష్టించాయి.

శత్రువుల పట్ల మాత్రమే కాఠిన్యం

స్త్రీలు, వృద్ధులు, పిల్లలపట్ల ఎంతో గౌరవంగా ఫకీర్లు ప్రవర్తించేవారని కంపెనీ అధికారులు రాసుకున్న డైరీల ద్వారా తెలుస్తుంది. దాడుల సందర్భంగా కంపెనీ అధికారులు,నూతన జమీందారులు, గుమస్తాలు, కంపెనీ సిబ్బంది అడ్డుపడి, సాయుధంగా ప్రతిఘటించితే తప్ప మజ్నూషా దాళాలు ఆయుధాలకు పని కల్పించేవి కావు. ఈ దాడులలో సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది, కష్టనష్టాలు కలుగకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు సాయుధ దాళాలకు తగిన హెచ్చరికలను జారీచేయటమేకాక, ఆదేశాల ఉల్లంఘన జరిగితే ఎంతటి సన్నిహితుడికైనా శిక్ష తప్పేదికాదు. ప్రజల నుండి విరాళాలు ఆశించవద్దని ఆయన హెచ్చరించారు. ధానికి సంపన్నవర్గాల నుండి మాత్రమే విరాళాలు సేకరించాలని,ప్రజలను ఎటువంటి వత్తిడికి గురిచేయరాదని ఆదేశాలను జారీచేసి బాధిత వర్గాలకు నష్టం కలగకుండ తగిన జాగ్రత్తలు తీసుకొని అవి ఖచ్చితంగా అమలు జరిగేలా చూసారు. ఫకీర్లు - సన్యాసులను దోపిడు దొంగలుగా, కంపెనీ పాలకులు ముద్రవేసారు. ఆంగ్లేయుల రికార్డులన్నిటిలో దుండగీలుగానే అటు ఫకీర్లుగానీ, ఇటు సన్యాసులుగానీ కన్పిస్తారు. అయితే ప్రజలు మాత్రం కంపెనీ పాలకుల పీడన నుండి తమను రక్షించడానికి వచ్చిన ఆపద్బాంధావులుగా ఫకీర్లను-సన్యాసులను ఆదరించారు, ఆదుకున్నారు. కదనరంగానికి వెంట నడిచారు. ఫకీర్లు వందల మైళ్ళు విస్తరించిన ప్రాంతంలో 40 సంవత్సరాలపాటు తమ ఇష్టారాజ్యం సాగించారంటే ఆ ప్రాంతపు ప్రజల చురుకైన భాగస్వామ్యం లేకుంటే సాధ్యమయ్యేదికాదు. ఫకీర్లు సామాన్య పేద వర్గాలను ఇక్కట్లు పెట్టినట్టు, ప్రజల నుండి కనీస ఆరోపణలు రాకపోవటం, ఆంగ్లేయుల రికార్డులలోనైనా నమోదుకాక పోవటం విశేషం. పేదలను పీడించే కంపెనీ తొత్తులైన ధానిక సంపన్న వర్గాల పట్ల ఫకీర్లు-సన్యాసులు కఠినంగా వ్యవహరించారు. ఆనాడు స్వదేశీ వర్తక-వాణిజ్యాన్ని నాశనం చేస్తున్న కంపెనీ వర్తకులు, వారి తొత్తులైన వర్తక-వాణిజ్య వర్గాల మీద దాడులు జరుపుతున్న సన్యాసుల నాయకులు శ్రీ భవాని పాథక్‌తో ఫకీర్లు సత్సంబంధాలను సాగించారు. సన్యాసులతో కలసి ఫకీర్ల దళాలు, పలు దాడులలో పాల్గొన్నాయి. మతంతో ప్రమేయం లేకుండ సాగిన ఈ పోరాటాలలో సన్యాసుల దాళానికి ఫకీర్లు నాయకత్వం