పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత సాfiతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాలు 21 సంఖ్యలో ఫలానా చోటున సమావేశం అయ్యారని, బహుశా ఫలానా ప్రాంతం మీద దాడులు జరుపగలరని స్ధానిక అధికారుల నుండి ఖచ్చితమైన సమాచారం అందిన తరువాత కూడ కంపెనీ సాయుధ దాళాలుమజ్నూషా దాళాలను చేరుకోలేకపోయేవి.పటిష్టమైన వ్యూహంతో ఆంగ్లేయ అధి కారులు సాయధ బలగాలతో ఫకీర్లసమావేశస్థలిని చేరుకునేప్పటికీ, అప్పటికే ఫకీర్లు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయేవారు. సంఖ్యాబలం ఎంతఉన్నాక్షణంలో గమ్యం చేరుకోవటం, మరుక్షణాన లక్ష్యాన్ని సాధించుకుని నిష్క్రమించటం ఫకీర్లకుకొట్టిన పిండిగా మారింది. గుర్రాలు, ఒంటెల మీద సంచరించే దాళాలతో పాటుగా కాల్బలం కూడ ఆంగ్లేయ బలగాలకు అందనంత దూరం వెళ్ళిపోవటం ఎలా జరిగేదో అర్ధంకాక, కంపెనీ పాలకులకు ఏ విధంగా సంజాయిషీ ఇచ్చుకోవాలో తెలియక అధికారులు సతమతమయ్యెవారు. ప్రతి ప్రధాన పోరాటంలో 500 మంది వరకుఫకీర్లను సమీకరించటం, పకడ్బందీగా పధకం రచన జరగటం, వ్యూహాత్మకంగా శతృవు మీదా దాడి చేయటం, క్రమశిక్షణతో ఆ పథకాన్ని అమలు జరపటం గమనిస్తే, ఫకీర్‌ యోధుల యుద్ధ కళాచాతుర్యం, సాహసం, జ్నూ షా లాింటి నాయకుల సామర్థ్యం అర్ధమవుతుంది. ఫకీర్లు ప్రధానంగా కంపెనీ కచ్చేరీలు, కంపెనీ కర్మాగారాలు, కంపెనీ తొత్తుల ప్రాసాదాలు, కోటల మీద దాడులు జరిపారు. ప్రజల నుండి బలవంతంగా వసూలు చేసిన రెవిన్యూను మూటగట్టీ కంపెనీకి చేరవేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం అందాగానే ఆ ప్రాంతం మీద దాడి జరిగేది. ఆ ప్రాంతంలో ప్రజలు, రైతులనుండి వసూలు చేసిన రెవిన్యూ మొత్తాలను స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలుతీర్చిసమస్య పరిష్కరించి ఫకీర్లు మటుమాయం అయ్యేవారు. ఈ సంఘటనలలో చంపటం,గాయపర్చటం లాింటివి జరిగేవి కావు. శతృవు నుండి ప్రతిఘటన ఎదురైతే మాత్రం దయాదాక్షిణ్యాలు చూపేవారు కారు. ఈ హింసకు స్వపర భేదాలు వుండేవి కావు. మతంఆసరాతో తప్పించుకోచూసిన కంపెనీకి చెందిన ముస్లిం అధికారులను ఫకీర్లు విడిచి పెట్టకుండ ప్రజలకు శతృవా? కాదా? అనే ప్రాతిపదికన సంహరించిన శిక్షించిన సంఘటనలు ఉన్నాయి. అధికారుల వ్యవహారసరళి ఒక్కటే తమ చర్యలకు ప్రాతిపదిక తప్ప, మతం, కులం, ప్రాంతం ఫకీర్లు-సన్యాసుల ఉద్యమంలో జోక్యం చేసుకోడానికి వీలులేకుండ చర్యలు తీసుకోవడం విశేషం. అధిక వడ్డుని గుంజుతున్న వడ్డీవ్యాపారస్తుల పట్ల మజ్నూ షా నిర్దాకి∆ణ్యంగా వ్యవహరించారు. ప్రజల నుండి, గూఢచారి దళం నుండి సమాచారం అందగానే దాడులను నిర్వహించడం, లభించిన నగదును స్వాధీనం చేసుకోవటం, ఋణ పత్రాలను,రైతుల భూముల తనఖాపత్రాలను, భూస్వాధీన పత్రాలను తగులబెట్టేసి, భవిష్యత్తులో ఎవ్వరూ కూడ ఎటువంతి బకాయిలను మహాజనులకు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించి, మహాజనులు కూడ ఎటువంటి వసూళ్ళ చేయరాదాని శాసించి ఫకీర్ల దళాలు అదాశ్యమయ్యేవి. కంపెనీ రెవిన్యూ వసూళ్లను అనేక రెట్లు పెంచి నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నందున తగినంత సొమ్ము వుందని తెలియగానే మజ్నూ షా ఆ ప్రాంతపు కచ్చేరి మీద దాడి చేసి సొమ్మును స్వాధీనం చేసుకొని, రెవిన్యూ రికార్డులను తగులబెట్టి ప్రజలను