పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 20 ఖచ్ఛితంగా అమలు పర్చేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను అప్పగించారు. ఆర్థిక వనరుల సేకరణ, పోరాట దాళాల సమీకరణ, గూఢచర్య దళం ఏర్పాటు, ఆహారం, ఆయుధాల సమీకరణ - సరఫరా,ప్రజల సమస్యల పరిష్కారం తదితర వ్యవహారాల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి.

గెరిల్లా పోరాటం

ఫకీర్లు, సన్యాసుల పోరాటాలు ప్రధానంగా గెరిల్లా పద్ధతిలో సాగాయి. శత్రువు బలంగా ఉన్నప్పుడు వెనక్కి తగ్గటం. శత్రువు ఆదమరచి ఉన్నప్పుడు దాడులు చేసే పద్ధతులను అనుసరించారు. శత్రువుతో ముఖాముఖి ఎదుర్కోక తప్పనప్పుడు ప్రాణాలకు తెగించి పోరు సల్పటం ఫకీర్ల పోరాట విధానాలు. 1761 డిసెంబరులో బరద్వాన్‌కు చెందిన పాత జమీందారుతో కలిసి కంపెనీ సాయుధ దాళాల మీద తొలిసారిగా తిరగబడి తమ సుదీర్గ పోరుకు ఫకీర్లు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఫకీర్ల-సన్యాసుల పోరాటం సాగిన నాలుగు దాశాబ్దాల కాలంలో ప్రతి సంవత్సరం కంపెనీ పాలకులు ఒకటి, రెండు ప్రధాన పోరాటాలను ఎదుదుర్కొనక తప్పని పరిస్థితులను ఫకీర్లు కల్పించారు. ప్రతి ప్రధాన పోరాటంలో కనీసం 500 మంది ఫకీర్లు పాల్గొనటం విశేషం. ఫకీర్ల సేనాని మజ్నూషా పిలుపునిస్తే, అతి తక్కువ సమయంలో 50 వేల మంది తరలి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని కంపెనీ అధికారులే తమ నివేదికలో రాసుకున్నారు. జమీందారులు, మహాజనులు, కంపెనీ పాలకులు, అధికారుల మీద ఫకీర్లు దాదులు సాగించారు . జమీందారులకు ముందు తెలియజేసి దాడులు చే సనన సంఘటనలున్నాయి. అకృత్యాలకు స్వస్తి పలకమని, బలవంతపు రెవిన్యూలను ఆపమనికంపెనీ పాలకులను, జమీందారులను హెచ్చరించి, ఆ తరువాత దాడులను జరిపేవారు.ఈ విషయం కంపెనీ పాలకులకు తెలిసి బలగాలతో తరలి వచ్చేలోగా ప్రజా గూఢచారి దళం నుండి సమాచారం అందుకుని ఫకీర్లు నిరాటంకంగా దాడులు నిర్వహించి, క్షేమంగా వెళ్ళిపోయేవారు. ఫకీర్లు దాడిచేస్తారని భయం ఉన్నజమీందార్లు కంపెనీ సహాయం కోరుతూ లేఖలు రాసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జమీందారుల వినతి మేరకు కంపెనీ పాలకులు '..దాడులు మానమని, లేకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని..' మజ్నూ షాకు హెచ్చరికలు చేసినా ఏ మాత్రం ఖాతరు చేయకుండ నిర్దేశించిన సమయానికి గమ్యం చేరుకుని, కంపెనీ సాయుధ దాళాలను నిలువరించి, పనిని పూర్తి చేసుకుని చడు చప్పుడూ లేకుండ పోరాట దాళాలు నిష్క్రమించేవి. కంపెనీ సాయుధ దాళాల కదలికలు అతి వేగంగా మజ్నూ షాకు ఎలా అందున్నాయో అర్ధంకాక అధికారులు అయోమయంలో పడేవారు. ఫకీర్ల గురించి తప్పుడు సమాచారం అందించి కంపెనీ దాళాలను మార్గం మళ్ళించి, గమ్యం చేరుకోనివ్వకుండ చేసి బలగాలను ప్రజలు చికాకు పర్చేవారు.మజ్నూ షా గూఢచారులు ఎవ్వరో కాదు ఆయా గ్రామాల ప్రజలు. పసిపిల్లలు కూడ గూఢచారులుగా సహకరించారు. ఫకీర్లకు సహకరించే గ్రామీణులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటంటం ద్వారా గూఢచారి వ్యవస్థను మజ్నూషా పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. మజ్నూషా దళాలు వందల