పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు 19 వివరించారు. ప్రజల వెతలను విన్నదర్మేష్‌ తీవ్రంగా వ్యధచెందారు. ఫిరంగీల మీద ఆగ్ర హం వ్యక్తంచే సారు . చివర కు, '...నాగా స సన్యాసులతో కలసి ఆయధా లు చేపట్టండి. ఆహార పదార్ధాలను, పంటలను దాచిపెట్టిన గిడ్డంగుల మీద దాడులు జరపండి. ఆకలితో ఆలమిస్తున్న ప్రజలకు పంచండి. ఫిరంగీలను తరిమివేయండి అంతకంటే మరో ప్రత్యాయమ్నాయం లేదు. ఆయధాలు చేప ట్టండి . ముందుకు సాగండి...' అంటూ మజ్నూ షాను కోరారు.

                                      ఫిరంగీలను తరిమికొట్టమని గురువు ఆదేశం

గురువు ఆదేశాలందుకున్న మజ్నూషా తన పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు, రైతులు, కులవృత్తుల, చేతివృత్తుల కళాకారులు, ఆయనకు తోడుగా నిలిచేందుకుముందుకు వచ్చారు. మజ్నూ షా తనదంటూ ఒక ప్రత్యేక దళాన్ని నిర్మించుకున్నారు. గురువు ద్వారా ప్రేరణ పొందిన మజ్నూషా, పోరాటానికి నాయకత్వం వహించి విదేశీయులైన ఫిరంగీలను తరిమివేయానికి కదాలి రమ్మని స్వదేశీ పాలకులను అభ్యర్ధించారు. మత ధర్మాలకు అతీతంగా ప్రజల పోరాలకు నాయకత్వం వహించమని కోరటం ద్వారా మజ్నూషా ఆనాటి రాజధర్మాన్ని గౌరవించారు. మాతృదేశం నుండి ఫరంగీలను తరిమివేయాలని, బాధాసర్పద్రష్టులైన ప్రజలను కంపెనీ పాలకుల దోపిడు, దాష్టీకాల నుండి విముక్తం చేయాలన్న లక్ష్యసాధన కోసం, ఆ పోరాట వీరులు మతాలకు అతీతంగా సమైక్య పోరాటం సాగించారు.

ఈ పోరాటంలో ఫకీర్లకు నాగా స న్యాసుల స్నేహహస్తం లభించింది. ఫకీర్లు-సన్యాసులు కలిసి ఫిరంగీల మీద దాడులు చేసి అనేక విజయాలు సాధించారు.ఒకచోట సన్యాసులకు ఫకీర్లు నాయకత్వం వహిసే మరోచోట ఫకీర్లకు సన్యాసులు నాయకత్వం వహించి ఈస్ట్‌ ఇండియా కంపెనీ బలగాలను మట్టి కరిపించి చరిత్రను సృష్టించారు. ప్రముఖ చరిత్రకారుడు Dr. Santimoy Roy చే, '... Against this ruthless invador (British) first flag of revolt was unfurled by Majnu Shah, the leader of a band of fakirs... గా కీర్తించబడిన మజ్నూ షా బ్రిీటిషర్ల మీద తిరుగుబాటు పతాకాన్నితొలిసారిగా బెంగాల్‌ గడ్డ మీదా నుండి ఎగురవేసారు.

ఆయుధబలం, అంగబలం గల శతృవుపై పోరాటం, సామాన్య విషయం కాదని గ్రహించిన మజ్మూషా ప్రజల అండదండలతో బలమైన ప్రజా పోరాటానికి సిద్ధమయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో పిటిష్టమైన పోరాట వ్యవస్థను రూపొందించేందుకు కృషి చేసారు. ఫకీర్ల ప్రాబల్యం గల ప్రాంతాలతో ప్రారంభించి, ఇతర ప్రదేశాల బాధితులను సమైక్య పర్చేందుకు ప్రయత్నించారు. పలు ప్రాంతాలలో కంపెనీ పాలకుల ఛాయలు కూడ కనిపించకుండ చేసి, ఆయా గ్రామాల ప్రజల జీవనానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండ గ్రామ కమిటీలు ఏర్పాటుచేసి గ్రామ పాలన సజావుగా సాగేట్లు చర్యలు తీసుకున్నారు. మజ్నూ షా ఫకీర్లకు తిరుగులేని నాయకుడైనప్పటికీ, పోరుబాట చాలా ప్రమాదాకరం కనుక సమష్టిగా ఆలోచించించటం, పథకాలను రూపొందించటం, రూపొందించిన పథకాలను