భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు 17 బ్రిీటిషర్లపై తొలి తిరుగుబాటుగా ఖ్యాతిగాంచిన ఈ ఉద్యమం 1761లో తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఈ పోరాటంలో హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు చేతులుకలిపి కంపెనీ పాలకులపై ద్వజమెత్తారు. సాంప్రదాయకమైన ఆయుధాలతో ప్రారంభమై ఆధునిక ఆయుధాలను సమకూర్చుకొని బ్రిీటిష్ తొత్తులైన జమీందారులు, అధికారులను సవాల్ చేశారు. ప్రజల మీద పీడన ఎక్కడైతే పెరిగిందో అక్కడల్లా ప్రత్యక్షమవుతూ ఫకీర్లు,సన్యాసులు ప్రజల మన్నన పొందసాగారు. ఈ తిరుగుబాట్లలో ప్రజలు అత్యధికంగా పాల్గొనటంతో ఈ తిరుగుబాట్లు కాస్తా ప్రజా పోరాటాలుగా మారిపోయాయి.
పోరాట వీరుడు జ్నూషా ఫకీర్ ఈ పోరాటంలో ఫకీర్లకు నాయకత్వం వహించిన మహాసేనాని మజ్నూ షా ఫకీర్. ఆయనను మంషా అని కూడ ప్రజలు పిలుచుకున్నారు. బెంగాల్ పరగణాలలోని కాన్పూరు సమీపానగల మాఖన్‌పూర్ గ్రామ నివాసి. బ్రిీటిషర్లను తొడగొట్టి సవాల్‌చేసి పలుమార్లు పరాజితులను చేసి కంపెనీ అధికారుల గుండెల్లో గుబులుపుట్టించిన మజ్నూషా, ధార్మిక వ్యవస్థాపరంగా చూస్తే ' మదారి ' సంప్రదాయానికి చెందిన ఫకీర్. మదారి తెగలో పీర్-మురీద్ సంబంధాలు ప్రధానం. ' పీర్' అంటే గురువు. మురీద్' అంటే శిష్యుడు. మురీద్ పీర్-మురీద్‌ల సంబంధం అంటే గురు- శిష్యుల సంబంధమన్నమాట. ఈ సంబంధం ధార్మికమైనది కనుక చాలా బలమైంది. గురువు ఆదేశిస్తే తమ ధాన మాన ప్రాణాలను అర్పించడనికి శిష్యులు సర్వదా సిద్ధంగా ఉన్నారు. ధార్మిక గురువులైన పీర్ పట్ల మురీదులు అత్యంత భక్తిభావం కలిగి ఉన్నారు. గురువుల మాట శిష్యులకు శిరోధార్యం. గురువుల స్థిర నివాస ప్రాంతాలు శిష్యులకు పరమ పుణ్యకే∆త్రాలు. ప్రతి సంవత్సరం నిర్దేశిత సమయానికి ప్రపంచంలో ఏ ప్రాంతాన ఉన్నప్పటికీ, ఎలాింటి పరిస్థితులో ఉన్నప్పిటికీ మురీద్‌లు తమ కుటుంబాలతో సహా ఈ క్షేత్రాలకు విచ్చేసి ఉత్సవాలలో భక్తిభావనతో పాల్గొందురు. గురువుల ఆశీస్సులు పొంది. పలు రోజుల పాటు గురువు సన్నిధిలో గడిపి తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోతారు. ఈ ఉత్సవాలు ధార్మిక విషయాల వరకే పరిమితమై సాగేవి. కంపెనీ పాలకుల దాష్టీకాలు పెచ్చు పెరిగిన తరువాత, ఈ క్షేత్రాలను కంపెనీ పాలకులపై తిరుగుబాట్లను రూపొందించే కేంద్రాలుగా ప్రజలు మార్చుకున్నారు. పోరాట వ్యూహాలను తయారు చేసుకునేందుకు, ఆయుధాల సమీకరణకు, పోరాట వీరులను ఎంపికచసుకునేందుకు, శికణ ఇచ్చేందుకు ఉపయాగించుకున్నారు. ఈ పరిసితులను పసికట్టిన కంపెనీ పాలకులు ఫకీర్ల మీద తగు చర్యలు తీసుకునేందుకు నిశ్చయించుకుని, అనువైన పరిస్థితుల కోసం ఎదురుచూడసాగారు.
నూటయాభై మంది ఫకీర్ల బలిదానం ప్రతి ఏడదిలాగే 1771లో కూడ ఫకీర్లు బెంగాల్ ప్రాంతంలో జరిగిన ఉత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కంపెనీ బలగాల మీద తిరుగుబాట్లు చేస్తూ, రెవిన్యూ వసూళ్ళకు ఆటంకాలు కలిగిస్తున్న ఫకీర్ల మీద కసి తీర్చుకునేందుకు ఎదురుచూస్తున్న కంపెనీ పాలకులకు ఈ ఉత్సవం మంచి అవకాశం కల్పించింది. ఫకీర్లు ఆయుధాలు