పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ 16 ఈస్ట్‌ ఇండియా కంపెనీ అనుసరించటం ప్రారంభించింది. కులవృత్తులు, చేతివృత్తులు, వ్యవసాయకూలీల జీవనం తీవ్ర సంక్షోభానికి గురైంది. కంపెనీ అనుసరిస్తున్న ఎగుమతి - దిగుమతి విధానాలు దేశీయ వర్తక-వాణిజ్యాలకు గొడ్డలిపెట్టుగా తయారయ్యాయి. ఈ భ యంకర పరిస్థులకుతోడు గా వడ్డీవ్యాపారస్థులు అత్యధిక వడ్డీల తో ప్ర జ లను దోచుకోసాగారు. గ్రామీణ వ్యవస్థ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండ అందినంత రెవిన్యూ రాబట్టుకోవాలన్న ఏకైక దృష్టితో కంపెనీ అధికారులు క్రూరంగా వ్యవహరించసాగారు. అత్యధిక రెవిన్యూను వసూలుచేసి పెట్టే నూతన జమీందారులను నియమించి, ఆధిక రెవిన్యూ వసూళ్ళకు మరిన్ని అవకాశాలు, అధికారాలు కల్పించి ప్రజల మీదకు పురికొల్పారు. ఈ పరిస్థిలకు తోడుగా ఆనాడు ధార్మిక ప్రచారంగావిస్తూ దేశమంతా తిరుగుతూ గడిపే ఫకీర్లు-సన్యాసులకు పూర్వపు పాలకులు కల్పించిన ఉచిత భూమి సదుపాయాలను,ప్రచార సౌకర్యాలను కంపెనీ పాలకులు హరించివేయటం ప్రారంభించారు. స్వదేశీ ప్రభువులు సంక్రమింప చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవటంగానీ, లేదా ఆత్యధిక రెవిన్యూ కట్టమనిగానీ వేధించసాగారు. ఆనాటి పాలకుల భూరివిరాళాలతో, భూములద్వారా లభించే ఆదాయంతో ధార్మిక ప్రచారం చేసుకుంటూ, ఏర్పాటు చేసుకున్న ధార్మిక వ్యవస్థల మనుగడకు కంపెనీ చేపట్టిన మార్పులు నష్టదాయకమయ్యాయి. ఈ చర్యలు సన్యాసులు-ఫకీర్ల ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి.

భయంకర క్షామం

1769-70లో బెంగాల్‌ తదితర ప్రాంతాలలో వచ్చిన భయంకర క్షామం జన జీవితాలను అతలాకుతలం చేసింది. ఆకలిదావులకు తాళలేక భారీ సంఖ్యలో ప్రజలు ఇతరప్రాంతాలకు వలస వెళ్ళారు. ఆస్తిపాస్తులను అమ్ముకోవటమేకాక మనుషులను విక్రయించటం కూడ జరిగింది. మనుషులే మనుషులను పీక్కుతినే దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి.మూడోవంతు ప్రజలు ప్రాణాలు విడిచారు. ఆ సమయంలో కూడ కంపెనీ అధికారులు,జమీందారులు రైతులకు రెవిన్యూ వసూళ్ళ విషయంలో ఏమాత్రం మినహాయింపులు ఇవ్వకపోగా మరింత దారుణంగా వ్యవహరించారు. ఆంగ్లేయ అధికారి W.W.Hunter తన గ్రంధం The Annals of Rural Bengal (1770-1771) లో, ఆనాటి భయంకర ప రి స్థితులను వివరించార ు . '...కరవు పరిస్థితిప్రజలను అన్ని రకాలుగా పట్టిపీడిస్తున్నసమయంలో 35 శాతం ప్రజలు, 50 శాతం రైతులు నాశనమైపోగా,కంపెనీ పాలకులు మాత్రం తగ్గించాల్సిన రెవిన్యూను, 5 శాతం కూడ తగ్గించకపోగా 10 శాతం పెంచటం జరిగింద...' ని ఆయన పేర్కొనడాన్ని బట్టి అంత భయానక పరిస్థితులలో కూడ బ్రిీటిషర్లు ఎంత రాక్షసంగా వ్యవహరించారో అర్థమౌతుంది. ఈపరిస్థితులను అవకాశంగా చేసుకుని మహాజనులు ( వడ్డు వ్యాపారులు) , జమీందారులు,అధికారులు బ్రిటిష్‌ వర్తకులు, రైతులను, ప్రజలను పీల్చి పిప్పి చేయసాగారు. ఆ పరిస్థితులు ఫకీర్ల - సన్యాసుల పోరాటాలకు ఊపిరి పోశాయి. పీడనకు వ్యతిరేకంగా ప్రజల అసంతృప్తి, అసహనం, ఆగ్రహం నుండి తిరుగుబాట్లు రగులుకున్నాయి.