పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భారత సాfiతంత్య్రోద్యామం-ముస్లిం ప్రజాపోరాలు 15 నువ్వెంతగానో ప్రేమించిన మాతృభూమిలో నీ సమాధి కోసం కనీసం రెండు గజాల నేలైనా మిగలలేదు నీకు ...'. పూర్వీకులూన, తానూ పుట్టి పెరిగిన ఈ మట్టిలో కలసిపోవాలనుకున్న బలమైన కోరిక తీరే అవకాశం లేకపోవటంతో బహుద్దాూర్‌ షా జఫర్‌ ఈ మేరకు తనహృదయావేదానను వ్యక్తీకరించాడు. వర్తకం పేరిట ఈ నేల మీద కాలుప్టిెన బ్రిీటిషర్లు, స్థానిక ప్రభువులను క్రమక్రమంగా పరాజయం పాల్జేస్తూ, ఈ భూభాగాన్ని హస్తగతం చేసుకున్నారు. సుమారు రెండు వందల ఏండ్లు పాలన సాగించినప్పటికీ, ఈ నేలను తమ దేశంగా బ్రిీషర్లు ఏనాడు భావించలేదు. ఈ గడ్డను వలస కాలనీగా మాత్రమే పరిగణించారు. ఈ దేశంతమది కాదు కనుక, ఇక్కడ నుండి అందినంత తరలించుకుపోవటం ప్రారంభించారు.భూసంపదతోపాటు భూమి పుత్రుల స్ధభాగ్యాన్ని కూడ పలు మార్గాలద్వారా దోచుకున్నారు. భూమి ఆధారంగా ప్రారంభమైన ఈ దోపిడు అన్ని రంగాలకు అన్ని వర్గాలకు ప్రజల వరకు సాగింది. బ్రిీటిషర్లు రాకముందు మొగల్‌ రెవిన్యూ పద్ధతుల ప్రకారం భూమికి రైతు ఆసామి.రక్షణ కల్పిస్తున్నందున పంటలో భాగాన్ని రైతులు పాలకులకు సమర్పించేవారు. రాజభాగం చెల్లిస్తున్నంత కాలం రైతును భూమి నుండి తొలగించే హక్కు రాజుకూ ఉండేది కాదు. ఈవిషయాన్ని Mr. Narahari Kaviraj `తన Wahabi and Farazi Rebels of Bengal „గ్రంథంలో ఈ విధగా పేర్కొన్నారు.' ...remuneration of sovereignty or returns for the care of royalty i.e, the protection the king was to give to the life and security of the raiyat. So the king was supposed to posses no rights of property in land beyond a definite share of its produce....—.

దోపిడుకి అనువుగా రెవిన్యూ విధానాలు బ్రిీటిషర్లు ఈ రెవిన్యూ వ్యవస్థను తమ దోపిడుకి అనుకూలంగా మార్చుకున్నారు. పాలకులకు, రైతుకు మధ్యన రాజభాగం వసూలుచేసే వ్యక్తులను, శక్తులను రంగప్రవేశం చేయించారు. తమ చేతులకు మట్టి అంటకుండ రైతు కష్టాన్ని పట్టిచుకోకుండ అందినంత తరలించుకుని పోవాలన్న ధోరణితో మధ్యవర్తికి అవకాశాలు కల్పించారు. రాజభాగం వసూలు పద్ధతులను క్రమంగా మార్చుతూ, రైతుకు భూమి మీద గల హక్కులను హరించివేస్తూ, కోరినంత రెవిన్యూ సమకూర్చగల జమీందారులకు ఆ హక్కులను ధారాదాత్తం చేశారు. 1765లో బెంగాల్‌ ' దివానీ ' ఈస్ట్‌ ఇండియా కంపెనీ హస్తగతమైన తరువాత,ఈ పరిస్థితి మరింత ఉధాతమైంది. రైతు చెల్లించాల్సిన రెవిన్యూను కంపెనీ పాలకులు అనూహ్యంగా పెంచారు. ( "...It is now generally recognised that main thrust of the East India Company particularly after assumption of diwani in 1765 was to enhance the land revenue of the province..." - Regional Economy in Eastern India - II. by B. Choudary)

ఈ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలకు ప్రాణాంతకమయ్యాయి. రైతు జీవితం దుర్భరంగా మారింది. గ్రామీణ ఆర్ధికవ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే వాణిజ్య పద్ధతులను