పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రైతులను పీడించిన, మన కుల, చేతి వృత్తిదారులను హరించిన, మన భూములను ఆక్రమించిన, మన స్త్రీలను అవమానపర్చిన బ్రిీటిష్‌ సామ్రాజ్యవాదాుల మీద ఆనాడు మన ముస్లిం పోరాటయోధుల సాగించిన పోరాటాల ఉదంతాలను కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ, ఈనాటి సంప్రదాయ భావజాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజాసామ్య లౌకిక ధ్రుక్పథంతో మనం పోరాడల్సిన బాధ్యత లేదా? అంటూ మర్మంగా ప్రశ్నిస్తారు. నాటి చరిత్ర జ్ఞాపకాలతో నేటి సమాజాన్నినడుపుతూ ఆయన నడుస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే Alex Haily రాసిన ROOTS కు ఉన్న శక్తి ఈయన భారత స్వాతంత్య్రోద్యమం : ముస్లిం ప్రజాపోరాలకు ఉంది. ఈ పుస్తకానికే కాదు, ఆయన భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల భాగస్వామ్యాన్ని దాశ్యీకరిస్తూ మనకందించిన ప్రతి పుస్తకంలో అ శక్తి నర్మగర్భమైంది.ఆయన ఆవేదన, ఆయన సంఘర్షణ ఆయా పుస్తకాలలోంచి, మనల్ని పలకరించే పాత్రల్లోంచి మనకు విన్పిస్తారు. ఆయన నిజజీవితంలోకి వస్తే, ఆయన పుట్టిన నాిటి నుండే సంఘర్షితుడు. ఆయన అధ్యయనం, ఆయన రచన, దాశ్యీకరణ, సమాజాన్నిఫోటో తీయడం దగ్గర నుండి ఎక్స్‌రేతీసి స్కానింగ్ చేసే దాకా ఎదిగింది. ఆయన ప్రతి అక్షరం వెనుక ఒక ఫీలింగ్ ఉంది.ఆవేదన ఉంది. ఈ సమాజాన్ని పునర్మించే క్రమంలోనే చెబుతారాయన. నేను ఆయనను చరిత్ర రచయితగా చూడలేకపోతున్నాను. ఈ సమాజానిfl పునర్మించే యోధుడు కావాలి.మహత్మా ఫూలే, సర్‌ సయ్యద్‌ అహమ్మద్‌, డాక్టర్‌ అంబేద్కర్‌, పెరియార్‌, వీరందరూ చరిత్ర రచయితలే కాదు, చరిత్రను పునర్మించిన వారు కూడ. మతం వ్యక్తిని నిర్మిస్తుంది, చరిత్ర జాతిని నిర్మిస్తుంది. మతం పేరుతో జాతిని అణిచివేస్తున్నారు. ఆందుకాయన ఎన్ని రాత్రులు నిద్రాపోలేదో ! ఎన్ని వేదనలు ఆయనగుండెలను తొలిచాయో ! మన కళ్ళ ముందే ఎన్ని కట్టడాలు కూలిపోతున్నాయి ! ఎంత చరిత్ర భగ్నమౌతోంది ! Now it is irrelevant అంటారాయన. To built and to rebuilt అంటారు. ' నేను రచయితనే కాదు. యుద్ధ యోధుడ్ని కూడ. నా జాతి పట్ల,నాదేశం పట్ల, నా ప్రజల పట్ల నేను ప్రేమికుడ్ని, గాఢ ప్రేమికుడ్ని. ఆ ప్రజానీకం విముక్తికోసం నేను కలం యోధుడ్నిఅవుతున్నాను ' అని నినందిస్తున్నారు. ఆయన కలం రాల్చిన ఇంకు చుక్కలకు, భారతదేశాన్ని పరాయి పాలకుల కబంధ హస్తాల నుండి మాతృదేశాన్నివిముక్తం చేయడానికి పోరుబాట నడిచి, ఆగ్నియుగానికి బాటలు వేసిన మజ్ను షా ఫకీర్‌,మీర్‌ నిస్సార్‌ అలీ, దూదు మియా, మొఎల్వి అలీ ముస్సలియార్‌ తదితరులు రాల్చిన రక్తపుచుక్కలకు ఏమాత్రం తేడ లేదు. అందరిదీ స్వేఛ్ఛా-స్వాతంత్య్రాల కోసం సాగిన విముక్తిపోరాటమే. ' ఈ దేశానిfl తాకట్టు పెట్టే శక్తుల పైనా పూర్వీకుల్లా పోరాడుతాను. ఆకనివిక్షన్‌ నాకుంది ' అంటారాయన. నిజం చెప్పమంటారా ? ఈ పుస్తకం చదాువుతున్నంత సేపు నేనొక స్వాతంత్య్రసమర యోధాుడిలా స్వారీ చేశాను. నేనొక జ్ఞాన జ్యోతిగా వెలుగొందాను. నేనొక చరిత్రనిర్మాతగా ముందుకు కదులుతున్నాను. మీరూ నాతో నడుస్తారా ? రండి. మన మాతృభూమిని ర క్షికుందాం. మరో స్వాతత్ర్య పోరానికి కేకవేస్తూన్న సయద్ నశీర్‌ అహమద్‌తోపాటుగా...నేను....మీరు.....మనం.