155 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
1948 ఫిబ్రవరి 23న పాకిస్థాన్ ప్రభుత్వాన్ని, పాలకులను గుర్తించినప్పటికీ,
పాలకులు, పాలక వర్గాల తాబేదార్లు గఫార్ ఖాన్ను, ఖుదా యే-ఖిద్మత్గార్ కార్యకర్తలను,
మద్దతుదారులను వదలిపెట్టలేదు. ఆవిధంగా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటుండగా, 1949
జనవరిలో మహాత్మా గాంధీ హత్యకు గురవటంతో సరిహద్దు గాంధీ హతాశులయ్యారు.
అహింసోద్యమంలో తమ మార్గదర్శి ఆకస్మాత్తుగా అంతర్ధానం కావటం, అది కూడ కిరాతకుల
కుట్రకు ఆ అహింసా మూర్తి బలికావటం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ను వ్యాకులతకు గురిచేసింది.
ఆ తరువాత ప్రజాస్వామిక వ్యవస్థలో మనుగడ సాగించేందుకు గఫార్ ఖాన్
సోదరులు మార్చి మాసంలో పీపుల్స్ పార్టీని ప్రారంభించారు. ఖుదా-యే -ఖిద్మత్ర్
కార్యకర్తలంతా ఆయన వెంటనడిచారు. ఈ వాతావరణాన్ని గమనించిన పాకిస్థాన్ పాలకులు
కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు. గఫార్ ఖాన్ను, ఆయన సోదరుడు డాక్టర్ ఖాన్ సాబ్న
అరెస్టు చేసారు. 1954 లో డాక్టర్ ఖాన్ సాబ్ను విడుదల చేశారు. సుదీర్ఘకాలం సరిహద్దు
గాంధీని కారాగారంలో బందీచేసి ఆ తరువాత విడుదల చేసారు. ఈ విధంగా ఏడు
సంవత్సరాల నిర్బంధం తరువాత ఖాన్ వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోకి ఆయన తిరిగి
వచ్చారు. పఠాన్లను భూమిని ఫక్తునిస్థాన్ ' గా ప్రకటించి పాకిస్థాన్లో భాగంగా
ప్రత్యేక ఏర్పాట్లు చేయమని ఖాన్ గఫార్ ఖాన్ డిమాండ్ చేసారు. ఆయన డిమాండ్ను
పాకిస్థాన్ పాలకులు త్రోసి పుచ్చారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో మళ్ళీ డాక్టర్ ఖాన్
సాబ్ విజయం సాధించి వాయవ్య సరిహద్దు రాష్ట్రానికి ముఖ్యమంత్రయ్యారు..
1956 మార్చి మాసంలో పాకిస్థాన్ని, పాలక ప్రభువులు ఇస్లామిక్ రిపబ్లిక్ గా
ప్రకటించుకున్నారు. ఈ నేపధ్యంలో మరోసారి ఖాన్ గఫార్ ఖాన్ మీద పాలకుల క్రూర
దృష్టి పడింది. జూన్ మాసంలో ఆయనను అరెస్టు చేసారు. భారీగా జరిమానా విధించి,
ఆయన ఆస్తిపాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. డాక్టర్ ఖాన్ సాబ్ మే మాసం 9వ
తేదీన హత్యకు గురయ్యారు. 1958 పాకిస్థాన్లో రాజ్యాంగం రద్దుచేసి ' మార్షల్ లా ' ను
ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీలను రద్దుచేసి, నేతలను అరెస్టు చేసారు. గఫార్ ఖాన్
మీద అరెస్టు వేటుపడింది. ఆయన వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని 1959 ఏప్రిల్లో
విడుదల చేసినట్టే చేసి, 1961లో ఆయనను, ఆయన సహచరులను మళ్ళీ జైలు పాట్టేసారు.
ప్రపంచంలో ఎవ్వరూ వెళ్ళనన్ని ఎక్కువసార్లు, ఎక్కువ కాలం జైళ్ళలో గడిపి రికార్డు సృష్టించిన
ఆయనను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ Prisoner of the Year గా ప్రకటించింది. అంతర్జాతీయంగా
వచ్చిన ఒత్తిడి వలన ఆయనను విడుదలచేసి, చికిత్స నిమిత్తం ఇంగ్లాండ్ పంపడానికి పాకిస్థాన్
ప్రభుత్వం అంగీకరించింది.
1969లో గాంధీజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖాన్ అబ్దుల్ గఫార్
ఖాన్ భారతదేశం వచ్చారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లింలను ఐక్యతను ఆశిస్తూ
జరిగిన నిరాహార దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. 1971లో వలస జీవితాన్ని ముగించి
ఆయన పాకిస్థాన్ వెళ్ళిపోయారు. పాకిస్థాన్లో పరిస్థితులు మారాయి. ఆయనను మరోమారు
అరెస్టుచేసి, ఆయన స్థాపించిన జాతీయ అవామీ పార్టీని నిషేధించారు. ఈ విధంగా పలుమార్లు