సయ్యద్ నశీర్ అహమ్మద్ 146
ఉద్యమకారులను అడ్డుకోలేకపోయిన పోలీసులు, సైనికులు ఆ అక్కసుతో అమానుష చర్యలకు
పాల్పడ్డారు. సరిహద్దు రాష్ట్రం మొత్తం సైనికులు అదుపు ఆజ్ఞల క్రిందకు రావటంతో ప్రభుత్వ
బలగాల కిరాతక చర్యలకు అంతులేకుండా పోయింది. సరిహద్దు రాష్ట్రంలోని అన్ని
ప్రాంతాలలో పైశాచికత్వం రాజ్యమేలింది. బ్రిటీష్ పోలీసు పిశాచాలకు ప్రధానంగా
ఖుదా - యే -ఖిద్మత్ గార్ కార్యకర్తలు బలైపోయారు. ఉద్యమకారులు పాడి-పంటలను ధ్వంసం
చేసారు. నాయకుల గృహాలను గుర్తించి నిల్వచేసుకున్న పంటను కిరోసిన్ పోసి తగులబెట్టారు.
లాఠీలు ప్రయోగించి అవమానకర రీతిలో చిత్రహింసలు పెట్టారు.
ఖుదా-యే-ఖిద్మత్ గార్లను అక్రమంగా అరెస్టు చేసి నడిబజార్లలో నిల్చోపెట్టి,
బలవంతంగా దిగంబరులను చేసి, వెంటపడి తరుముతూ పరుగులు తీయించారు.
పరుగులెత్తుతున్నపుడు తన్నడం, తుపాకి మడమలతో పొడవటం సర్వసాధారణమైంది.
ప్రజలను కాల్చి చంపి, శవాలను కన్పించకుండా మురికి కాల్వలలోకి పారేశారు. సామూహిక
ఖననం చేశారు. ఉద్యమకారులను పట్టుకెళ్లి, భవనాలపై నుండి కిందనున్న రాళ్ళమీదకు
దొర్లించి, ఆ బాధను తట్టుకోలేక బాధితులు వేస్తున్న కేకలను వింటూ కిరాతక ఆనందాన్ని
అనుభవించారు. మురికి గుంటల్లోకి గిరవాటువేసి, మురికి నీళ్ళల్లో ముంచి ఊపిరాడక
ఉద్యమకారులు హాహాకారాలు చేస్తుంటే కేరింతలు కొట్టారు. రక్తం గడ్డకట్టుకుపోయే
దారుణమైన చలిలో లోతైన చల్లటి నీటిగుంటల్లోకి కార్యకర్తలను దొర్లించి రాక్షసానందం
పొందారు. ఈ అతి భయంకర చిత్ర హింసలను భరించడానికి ఉద్యమకారులు సిద్ధపడ్డారు
తప్ప, ఆయుధం అందుకొనేందుకు గాని, అహింసా మార్గాన్ని వీడేందుకు గాని ఏమాత్రం
ఇష్టపడలేదు. ఆత్మాభిమానులైన పఠాన్ బిడ్డలు కొందరు ఈ అవమానాలు భరించలేక,
సంస్థ ప్రధాన లక్ష్యమైన అహింసా దీక్షను భగ్నం చేయలేక, అవమానాల నుండి విముక్తి
కోరుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు సంచలనం కల్గించాయి. ఈ మేరకు
వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలోని ప్రజలకు సేవలు అందించడానికి విచ్చేసిన ఆంగ్లేయ
సామాజిక సేవా కార్యకర్తలు, మిషనరీలు తమ తమ గ్రంథాలలో, డైరీలలో, లేఖలలో
చాలా హృదయవిదారకంగా ఆయా సంఘటనలను వర్ణించారు. ఏది ఏమైనప్పటికీ
సత్యాగ్రహోద్యమ కాలంలో ఏ ఒక్క ఖుదా-యే-ఖిద్మత్గార్ కూడా అహింసా మార్గం
వీడినట్టుగాని, దౌర్జన్యానికి పాల్పడినట్టుగాని చివరకు బ్రిటీషర్లు కూడా ఆరోపించకపోవటం
విశేషం. బ్రిటీష్ సైనికుల పాశవిక చర్యలను భరించలేక పోయిన కార్యకర్తలు, అటు అహింసా
మార్గం నుండి తప్పుకుని ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థ ప్రతిజ్ఞను ఉల్లంఘించలేక, ఇటు
అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ' భారతదేశంలో 30 రోజులు ' అను
గ్రంథ రచయిత ప్రొఫెసర్ ఫీల్డింగ్ కింగ్ హాల్ వివరించాడు. భగవంతుడు ప్రసాదించిన
జీవితాలను మానవుడు తనంతట తాను అంతం చేసుకోవటం మహాపాపమని పలుమార్లు
హెచ్చరికలు జారీ చేయాల్సినంత స్థాయిలో ఆత్మార్పణలు సాగాయి.
ఈ పరిస్థితుల ఉదృతిని గమనించిన బ్రిటీష్ అధికారులు ఖుదా-యే-
ఖిద్మత్ర్లను ప్రజలనుండి దూరం చేయడానికి అసత్య ప్రచారం ప్రారంభించారు. ఈ
కార్యకర్తలు ధరించే ఎర్రటి చొక్కాలను ఆధారం చేసుకుని ఖుదా యే-ఖిద్మత్గార్లు రష్యా
తొత్తులని, బొల్షివిక్ సిద్ధాంతాల ప్రేమికులని ప్రచారం చేసారు. ' కాంగ్రెస్ కార్యకర్తలమంటూ