Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 136

ఆదర్శంగా నిలిచారు.
గాంధీజీ పిలుపు మేరకు వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో ఆరంభమైన శాసనోల్లంఘన ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులు, సైన్యం అమానవీయ చర్యలకు పాల్పడ్డాయి. ఉద్యమకారుల పట్ల కిరాతకంగా వ్యవహరించాయి. ఈ హింసాత్మక వాతావరణంలో ప్రతి క్షణం పరమ భయంకర దాష్టీకాన్ని అనుభవిస్తూ సంస్థ గీచిన గీతను ఖుదా-యే-ఖిద్మత్ర్లు దాటలేదు. ఓర్పు, సహనమే ఆయుధాలుగా అహింసా సిద్ధాంతపు వెలుగులో చరిత్ర సృష్టించారు. ఆ అద్భుత చరిత్రలో ఖుదా-యే-ఖిద్మత్ గార్లు ప్రవర్తించిన తీరు, అందించిన అపూర్వ త్యాగాలు, ఆత్మార్పణలు చరిత్రలో ఆ సంస్థకు ప్రత్యేక స్థానం కల్పించాయి. బ్రిటీష్ ప్రభుత్వం తన కిరాతక చర్యలను బహిర్గతంగా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకొంది. వలస పాలకులు తమ చర్యలు బహిరంగం కాకుండా చూడాలని ఎంతగా ప్రయత్నించినా సాగుతున్న హింసాకాండ వివరాలు అస్పష్టంగా వెల్లడి కాసాగాయి. ఆ వార్తలు యావత్తు దేశాన్ని ఉత్కంఠకు గురిచేసాయి. భారత జాతీయ కాంగ్రెస్ ఈ వార్తల వేడిమికి తట్టుకోలేకపోయింది. నిజానిజాలను తెలుసుకునేందుకు శ్రీ విఠల్బాయ్ పటేల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రవేశాన్ని అడ్డుకున్న ప్రభుత్వం శ్రీ సులేమాన్ విచారణ కమిటీని స్వయంగా నియమించింది.
ప్రభుత్వ సహాయ నిరాకరణ నేపధ్యంలో శ్రీ విఠలాభాయ్ కమిటీ అష్టకష్టాలు పడి ప్రత్యక్షసాక్షులను విచారించి, 350 పేజీల నివేదికను పార్టీకి సమర్పించింది. ఈ కమిటీతో పాటు ఆనాడు వివిధ వార్తాపత్రికలు, ప్రభుత్వ విచారణ కమిటీ, లండన్ నుండి వెలువడే ఆంగ్లపత్రికలు, ప్రత్యక్షసాక్షుల కథనాలు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ రచనలు, ఆయన కుమారుడు వలీ ఖాన్ రచనలు, ఖుదా-యే-ఖిద్మత్ గార్ల మీద ఆనాడు బ్రిటీష్ ముష్కర మూకలు సాగించిన దుష్కృత్యాలను, పారించిన రక్తపుటేరులను, ప్రజల గుండెల మీద కురిపించిన తుపాకిగుళ్ళను, వందలాది ఖుదా-యే-ఖిద్మత్ర్లల ప్రాణాలను బలితీసుకున్న బ్రిటీష్ హంతక ముఠా కిరాతక కృత్యాలను, వికృత చేష్టలను, భయంకర విధ్వంసాన్ని సవివరంగా ప్రపంచానికి వెల్లడించాయి. ఈ వివరాలను తెలుసుకున్న భారతదేశం నిశ్చేష్ట కాగా, భారతీయులు ఖుదా యే-ఖిద్మత్గార్ల అపూర్వ బలిదానాలను, ఆత్మార్పణలను కథలు కథలుగా విని ఉద్యమస్ఫూర్తిని, ఉత్తేజాన్ని పొందారు.
చరిత్ర సృష్టించిన సంఘటనలు
శాసనోల్లంఘనకు ముందడుగు వేసిన అబ్దుల్ గఫార్ ఖాన్ ఖుదా-యే-ఖిద్మత్గార్ సమావేశాలను 1930 ఏప్రిల్ 18, 19 తేదీలలో సంస్థ ప్రధాన కార్యస్థానమైన ఉత్తమంజాయ్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి రెండు వందల మంది ఖుదా-యే- ఖిద్మత్ గార్ యోధులు హాజరయ్యారు. గఫార్ ఖాన్ సూచనలు, సంస్థ ఆదేశాలందుకున్న కార్యకర్తలంతా శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనేందుకు తమ ప్రాంతాలకు తరలివెళ్ళారు. ఈ సమావేశం తరువాత ఏప్రిల్ 23వ తేదీన ఉత్తమంజాయ్ లో మరో సభను ఏర్పాటు చేసి, ఆ సభలో బ్రిటీష్ చట్టాలను ఉల్లంఘించమని గఫార్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ సభానంతరం పెషావర్కు బయలుదేరిన ఆయన, నాకీ (NAAKI) పట్టణం చేరుకోగానే