Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 118

తొలి దశలో ప్రధాన పాత్ర వహించాయి. సమస్యల పరిష్కారం దిశగా ప్రారంభమై, విదేశీ శక్తులు, ఆ శక్తులకు వత్తాసు పలుకుతున్న స్వదేశీ విద్రోహులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో సంతరించుకున్న అనుభవం, చైతన్యం కాలక్రమేణా ఆ పోరాటాల దిశను-దిశను మార్చాయి. ఈ మేరకు ఆయా ప్రాంతాలలో ప్రారంభమైన పోరాటాలు క్రమక్రమంగా భారత స్వాతంత్య్ర సంగ్రామ ప్రవాహంలో అంతర్భాగమయ్యాయి.
భారత స్వాతంత్రోదమంలో భాగంగా సాగిన ప్రముఖ పోరాటాలు ఐదింటిలో ముస్లిం జనసముదాయాలు ప్రధాన పాత్రను పోషించటమేకాదు, నాయకత్వం వహించి నడిపించాయి. ఈ ఐదు కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ముస్లిం జనసముదాయాలన్నీ, ముస్లిమేతర జనసముదాయాలతో చేతులు కలిపి 1919 నుండి దశాబ్ధం పాటు మహోధృతంగా సాగించిన చారిత్రక ఉద్యమం, ఖిలాఫత్ ఉద్యమం. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ ఉద్యమాన్ని పక్కన పెడితే, బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తులు ఈ నేల మీద నిలదొక్కుకునే ప్రయత్నం ప్రారంభించగానే బెంగాల్కు చెందిన ముస్లిం ఫకీర్లు తొలి తిరుగుబాటు శంఖారావం పూరించారు. బెంగాల్ కేంద్రంగా వహాబీలు, వహాబీల సమకాలీన పోరాటయోధులైన ఫరాజీలు తిరగబడ్డారు. మలబారు తీర ప్రాంతానికి చెందిన మోప్లాలు 1800 నుండే ఆయుధం పట్టారు. ఈ తిరుగుబాట్లలో ఫకీర్లు, ఫరాజీలు, వహాబీలు, మోప్లాలు బ్రిటీషర్ల మీద కత్తికట్టి రణం సాగించారు. ఆ పోరాటాల గురించి గత అధ్యాయాలలో తెలుసుకున్నాం. ఆ పోరాట రీతులకు భిన్నంగా, భారతదేశ వాయవ్య సరిహద్దు ప్రాంతాలలోని సమరశీల పోరాట వీరులుగా ప్రసిద్ధి చెందిన పఠాన్ యోధులు 'ఖుదా-యే-భిద్మత్ గార్ ' లుగా అవతరించి జాతీయోద్యమంలో అపూర్వమనదగిన రీతిలో గాంధీజీ మార్గాన అహింసాయుధంతో పోరుసాగించి ధన్యులయ్యారు.
{{gap}ప్రవృత్తి, వృత్తిపరంగా పోరాట వీరులుగా ఖ్యాతి గడించిన పఠాన్లు, ఆయుధాలను వృత్తి పనిముట్లుగా ధరించి, కదనరంగమే కార్యక్షేత్రంగా భావిస్తారు. ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం, జాతి గౌరవం కోసం ప్రాణం ఇవ్వటం, ప్రాణాలు తీయడం వీరికి పరిపాటి. పగతీర్చుకోవడానికి ప్రయత్నించని కుటుంబాలను, జాతికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోడానికి యత్నించని పఠాన్ యువకుడ్ని నపుంసకుడిగా లెక్కగడతారు. అటువంటి పఠాన్ల జాతి, తమ కరకు కత్తులను పర్వత పంక్తుల్లోకి గిరవాటువేసి, అహింసా మార్గాన స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటీష్ సైనికమూకలను, ముష్కర పోలీసులను ఎదుర్కొన్నారు. ఆత్మార్పణలతో అహింసా సిద్ధాంతానికి, సత్యాగ్రహోద్యమానికి ప్రాణం పోసి, స్వాతంత్ర్య సమర చరిత్రలో సరికొత్త పేజీలను సృష్టించారు.
వాయవ్య సరిహద్దు ప్రాంతాలు
{{gap}భారతదేశ సంస్కృతి, చరిత్రలో వాయవ్య సరిహద్దు ప్రాంతాలు ప్రముఖ పాత్ర వహించాయి. అవిభక్త భారతదేశానికి వాయవ్య ప్రాంతంలో గల పంజాబ్, సింధ్ రాష్ట్రాలతో కలిపి ప్రస్తుత అఫ్ఘనిస్థాన్ సరిహద్దుల వరకు గల ప్రాంతాలన్నిటినీ బ్రిటీషర్లు వాయవ్య