పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కానీ సాధారణ హిందువులూ, సాధాణ ముస్లింలూ శాంతియత స హ జీవనం కోరుకుంటున్నారు. పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటిప్రాథామిక సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా కృషి చేయాలని ఆశిస్తున్నారు. అందరూ కలసి ప్రగతిపథంలో సాగిపోవాలని అభిలషిస్తున్నారు. మతోన్మాదాులు అన్ని మతాలలోనూ ఉన్నారు. వారు శక్తివంచనలేకుండ విషబీజాలు నాటుతూనే ఉన్నారు. నరమేధానికి కత్తులు నూరుతూనే ఉన్నారు. భారత్‌లో కాంగ్రెస్‌ పార్టీ, ఇతర లౌకిక పార్టీల వైఫల్యం కారణంగా హిందూత్వ శక్తులు విజృంభించాయి. శ్రీ లాల్‌ కృష్ణ అద్వానీ సోమనాథ్‌ నుంచీ అయోధ్యకు రథయాత్ర సాగించడం దేశవ్యాప్తంగా హిందువులలో మతాభిమానం, ముస్లింలలో అభద్రాతాభావం పెరగడనికి దారితీసింది. 1992లో బాబ్రీ మసీదు విద్వంసంతో మెజారిీటి మతస్థులు మైనార్టిల మనోభావాలను సృప్టించుకునే రోజులు పోయాయనే అభిప్రాయం ముస్లింలలోప్రబలింది. ఆ తర్వాత కూడ మతావేశాన్నిఎన్నికలలో ప్రచారాంశం చేయడంతో హిందూత్వవాదుల వేదిక అయిన భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం విశేషంగా పెరిగింది. కాంగ్రెస్‌ను ద్వేషించే కొందరు నాయకుల సారధ్యంలోని కొన్నిలౌకిక పార్టీలు సహకరించడంతో బి.జె.పి కేంద్రాంలో అధికారంలోకి వచ్చింది. రాజ్యాధికారం దక్కగానే హిందూత్వ శక్తులుమరింత శక్తిమంతమైనాయి. ఆ విధంగా దేశంలోని రెండు ప్రధానమైన మతాలకు చెందిన ప్రజలలో మతావేశం హద్దుమీరింది. అయితే అది మతావేశంతో అశాంతిగా ఉన్న కొన్నివర్గాలకే పరిమితం. మతాభిమానం మతోన్మాదాంగా మారితే ప్రమాదమనే అవగాహన భారత ముస్లింలలో ఉన్నది. ' హేతువే సేతువుగా మనగలిగే ఆధునిక సమాజంలో ప్రతి మతంలోని ప్రతి సిద్ధాంతం హేతు పరీక్షకు నిలబడి విశ్వజనీనమైన న్యాయానికి అనుగుణంగా ఉన్నప్పుడే విశ్వవ్యాప్తమైన ఆమోదం పొందగలుగుతుంది ' అని మహాత్మాగాంధీ చెప్పిన సూక్తి అన్నిమతాలకూ వర్తిస్తుంది. ప్రాణులకూ, స్త్రీలకూ, పిల్లలకూ రక్షణ కల్పించడం ఇస్లామ్‌పరమోద్దేశం. ఇందుకు భిన్నంగా ఇస్లాంకు ఏమి ఆపాదించినా అది కల్పితమేనన్న స్సృహభారత ముస్లింలలో ఉంది. అలీ సోదరులు, హసన్‌ అహ్మద్‌ మదాని, అష్పాఖుల్లాఖాన్‌, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, జాకీర్‌హు˙స్సేన్‌ వంటిఅనేకమంది సాfiతంత్య్ర సమరయోధుల నిరంతర కృషి ఫలితంగా భారత ముస్లింలలోవాస్తవిక దాష్టి, సహజీవనాభిలాష హృదాయంగతమైనాయి. హిందువులలో కూడ అత్యధికులు,లౌకికవాదాన్నీ, సహజీవన సిద్ధాంతాన్నీ విశ్వసిస్తున్నవారే. అందుకే మతవాదులు తాత్కాలికంగా ఆధిక్యం సంపాదించినా వారి ఆటలు ఎక్కువ కాలం సాగడంలేదు. ఈ శక్తుల ఆట కట్టింటించి దేశంలోని అన్ని మతాల వారూ సమిష్టిగా అభ్యుదయ పథంలో సాగిపోవాలంటే ఒకరి గురించి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి. ఒకరిపట్ల ఒకరికి సహిష్ణుతా, ఆదారాభిమానాలూ ఉండాలి.స్వాతంత్య్ర పోరాటంలో