సయ్యద్ నశీర్ అహమ్మద్ 116
భూయిష్టములుగానూ, మోప్లాల తప్పిదములను అతిశయోక్తులతో నిండినదిగానూ ఉన్నవనీ,
ప్రభుత్వము వారు శాంతిభద్రతలనే నెపముతో అనవసరముగా ప్రజలను సంహరించిన
విషయము వాటిలో తగ్గించి వ్రాయబడినదనీ', 'ఈ సభవారభిప్రాయ పడుతూ మోప్లాల
పక్షమున జరిగిన దౌర్జన్యములను నిరసిస్తున్నారు''''...”. అని పేర్కొనడం విశేషం.
చిరస్మరణీయ ఖ్యాతి
భూస్వాములకు వ్యతిరేకంగా ప్రారంభమై, బ్రిటీషర్ల మీద గురిపెట్టబడిన మోప్లా
రైతులు, ప్రజల పోరాటాలు జాతీయోద్యమంలో భాగంగా సాగినప్పటికీ, మోప్లాలు విమర్శలకు
గురికాక తప్పలేదు. బ్రిటీష్ సైనిక, పోలీసు దళాల తుపాకి గుండ్లకు ఎదురుగా నిలిచి,
చివరి రక్తపు బొట్టు నేల రాలేవరకు తొడగొట్టి పోరాడి ఆత్మార్పణలకు పాల్పడిన మోప్లా
మొనగాళ్ళు విమర్శలకు గురికావడం జాతీయ ఉద్యమంలోని కొందరు నాయకుల,
చరిత్రకారులు హస్వదృష్టికి నిదర్శనమని పలువురు ప్రముఖులు విమర్శించారు. ఏది
ఎలాగున్నా జాతీయోద్యమంలో తమదైన ముద్రవేసుకున్న మోప్లాల తిరుగుబాటు
ఎదుర్కొన్నంత ప్రశంసగాని, విమర్శగాని స్వాతంత్రోద్యమ చరిత్రలోని మరే ఉద్యమపోరాట
రూపం ఎదుర్కొనలేదనవచ్చు.
1800లో ప్రారంభమై 120 సంవత్సరాపాటు సాగి, 1920-22 లలో జాతీయ
స్థాయిలో కలకలం రేపిన మలబారు మోప్లాల పోరాటం 1922 జనవరి నాటికి ముగిసింది.
అనాటి పోరాటయోధులను 1971లో స్వాతంత్ర్య సమరయోధులుగా భారత ప్రభుత్వం
గుర్తించింది. ఈ పోరాటం ఎంతటి విమర్శకు గురైనా బ్రిటీష్ వ్యతిరేకతలో, దేశభక్తి
విషయంలో మోప్లాలు అగ్రగణులన్న చారిత్రక వాస్తవాన్ని ఎవ్వరూ కాదనలేని రీతిలో,
చిరస్మరణీయ ఖ్యాతితో స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో శాశ్వత స్థానాన్ని సుస్థాపితం
చేసుకున్నారు.