సయ్యద్ నశీర్ అహమ్మద్ 110
శత విధాల ప్రయత్నించారు. అది వీలుకాలేదు. ఈ విషాదాంతం బయటకు పొక్కగానే
దేశవ్యాపితంగా నిరసన వెల్లువెత్తింది. ప్రజలు నిరసన ప్రదర్శనలు జరిపారు. నాయకులు
ఈ సంఘటన మీద విచారణ కోరారు. ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ
విచారణ జరిపి పోలీసు అధికారులది ఎటువంటి తప్పులేదంది. ఆ పాపాన్ని రైల్వే అధికారుల
మీద నెట్టివేసింది. ఈ సంఘటనలో ప్రాణాలను కోల్పోయిన ప్రతి మోప్లా కుటుంబానికి
300 రూపాయల పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
హింసామార్గం ఎందుకు ఎన్నుకున్నారు?
భారతదేశంలో అగ్రనాయకులుగా పరిగణించబడుతున్న మహాత్మాగాంధీ, అలీ
సోదరులు, మౌలానా అబుల్ కలాం అజాద్ లాంటి ప్రముఖుల పర్యటనలతో ప్రభావితులైన
మోప్లాలు అహింసా మార్గం నుండి మార్గం మళ్ళి ఎందుకు హింసా మార్గం ఎంచుకున్నారు?
ఈ విషయమై అనుకూల ప్రతికూల వాదనలు సాగాయి. అహింసా మార్గంలో ఉద్యమిస్తామని
వాగ్దానం చేసిన మోప్లాల విజృంభణకు ఆంగ్లేయాధికారులు అనుసరించిన అణచివేత చర్యలే
ప్రధానమని కొంతమంది, జాతీయ నాయకత్వం మోప్లాలను నిస్సహాయులుగా వదిలి
పెట్టడమేనని మరికొంత మంది, అసలు మోప్లా ప్రజానీకంలో అంతర్గతంగా నున్న బ్రిటీష్
వ్యతిరేక స్వభావమని, మతం ప్రభావమని మరికొంతమంది చెప్పుకొచ్చారు. ఆ కారణాలన్నీ
దేనికదేగా చెప్పుకుంటే ఏదీ సంపూర్ణం కాదు.
Prof. ROLANDE MILLER, ప్రధానంగా అధికారులు తప్పుడు నిర్ణయాలు,
బలహీనమైన పథకాలు కారణమన్నాడు. కాలికట్ నుండి తిరుగాండికి సైనికదళాలను
తరలించటం, మౌల్వీ అలీ ముస్సలియార్ అరెస్ట్కు ప్రయత్నించటం, ఖిలాఫత్ కార్యకర్తలను
నిర్బంధించటం లాంటి అనుచిత చర్యలు మోప్లాలను రెచ్చగొట్టాయని, ఆ సంఘటనతో
రెచ్చిపోయిన మోప్లాలు తిరుగుబాటు బాటను ఎన్నుకున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఇదే తరహా అభిప్రాయాన్ని ప్రఖ్యాత జాతీయోద్యమ నాయకుడు శ్రీ కె.పి. కేశవ మీనన్ తన
KARINYAKALUM లో ప్రస్తావిస్తూ, మోప్లాలు హింసా మార్గం ఎన్నుకోవడానికి అధికారులు
అనుసరించిన కిరాతక చర్యలు మాత్రమే కారణమన్నారు. జెన్మి-రైతుల సంబంధాలు మాత్రమే
కాదని, అది మసీదుకు సంబంధించిన వివాదం కాదనీ అన్నారు. ఓర్పు నశించిన మోప్లాలు
అహింసా సిద్ధాంతాలను వదలి హింసా మార్గం ఎన్నుకున్నారని పేర్కొన్నారు.
మలబారులో తిరుగుబాటు చర్యలు ప్రారంభమై అత్యంత వేగంగా అన్ని ప్రాంతాలకు
వ్యాపించటం, హింసాకాండ చెలరేగటంతో అప్పటివరకు ఖిలాఫత్ - సహాయ నిరాకరణ
కమిటీలలో భాగస్వామ్యం వహించిన ముస్లిమేతర నాయకులు, మోప్లాల తీరుతెన్నులను
సమీక్షించి సంస్కరించాల్సింది పోయి, ఖిలాఫత్ కమిటీలకు దూరమయ్యారు. ఫలితంగా
విశాల దృక్పథం, గాంధీమార్గం పట్ల నిబద్ధత గల నాయకుల స్థానంలో ఉద్యమాన్ని స్థానిక
నాయకత్వం తన చేతుల్లోకి తీసుకుంది. సహజంగా ఆవేశపరులు, బ్రిటీషర్లంటే వ్యతిరేక
స్వభావం గల మోప్లాలు ప్రజల మీద దాడులకు పాల్పడిన ఆంగ్లేయాధికారుల మీద
ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. బ్రిటీష్ సైనిక బలగాలు పెద్ద సంఖ్యలో మోప్లాల
మీద విరుచుకుపడి, కిరాతక చర్యలకు పాల్పడుతున్నప్పుడు, సామాన్య మోర్గాలకు రక్షణగా