Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సయ్యద్ నశీర్ అహమ్మద్ 104

వారందరిని శత్రువులుగా భావించారు. ప్రధాన శత్రువైన తెల్ల పాలకులకు అనుకూలంగా వ్యవహరించిన వారంతా తమకు శత్రువులని ప్రకటించారు. శత్రువు హిందువైనా, ముస్లిమైనా క్షమించలేదు. శత్రువుతో సహకరించినా, ఆశ్రయం కల్పించినా, సమాచారం అందించినా అంతం చేసారు. బ్రిటీష్ పోలీసులకు సమాచారం అందజేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారి KHAN BAHADUR KURIMANNIL VALIYAMANNIL CHEKKUTTI SAHIB ని తిరుగుబాటు నాయకుడు హజీ కున్ హమ్మద్ నాయకత్వంలో హత్య చేసారు. బ్రిటీష్ ప్రభుత్వంతో, జెన్మిలతో చేతులు కలపొద్దంటూ కున్ హమ్మద్ హెచ్చరికలు చేసాడు. బ్రిటీష్ బలగాలను, అధికారులను సమర్ధించిన మోప్లాలను అవిశ్వాసులుగా ప్రకటించారు. ఈ పరంపరలో 1921 అక్టోబర్ 21 ప్రాంతంలో పట్టికాడు గ్రామం వద్ద 15 ముస్లిమేతరుల గృహాలను తగులబెట్టారు. నవంబర్ 24 తేదీన కాలికాపు అను గ్రామంలో ఖిలాఫత్ వ్యతిరేకులైన మోప్లాలకు సంబంధించిన 40 గృహాలను దహనం చేసారు. పరాయి పాలకులకు వత్తాసు పలికిన ప్రతి ఒక్కరూ ఇటువంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ మేరకు పలు శిక్షలు విధించారు.
ఆగస్టు సంఘటన తరువాత ఖిలాఫత్ ఉద్యమ నాయకులలో ఒకరైన మలప్పురం ధార్మిక నాయకుడు కె. సయ్యద్ మహమ్మద్ కోయా, శ్రీ పి. సన్ కున్ని మీనన్ అను అధికారితో మాట్లాడుతూ '.. బ్రిటీష్ ప్రభుత్వం సమాప్తమైంది. ఖిలాఫత్ పాలన ప్రారంభమైంది...' అనడాన్ని బట్టి ఆ రోజుల్లో మోప్లాలకు లభించిన విజయాలు ఎంతటి ఆత్మస్థైర్యాన్ని తెచ్చిపెట్టాయో తెలుస్తుంది. ఆనాటి సంఘటలనో పాల్గొని 1974 వరకు బ్రతికున్న కె.యం. మహ్మద్ అను మోప్లా యోధుడు Prof. CONRAD WOOD తో మాట్లాడుతూ ... పుక్కొట్టూరు వద్ద పోరాటంలో పోలీసులు పూర్తిగా ఓడిపోయారన్న భావనను నేతలు మాలో కల్పించారు. పోలీసులకు ఎటువంటి అధికారాలు లేవు. కొద్దిగా శ్రమిస్తే మనం గెలుస్తాం ...' అని మా నాయకులు చెప్పారన్నారు.
మోప్లా యోధుల పాలన
మోప్లా కార్యకర్తలలో ప్రగాఢ విశ్వాసాన్ని ఇనుమడింపచేసిన నాయకులు ఖిలాఫత్ పాలనకు అంకురార్పణ చేసారు. ఆధిపత్యం చాటుకున్న ఖిలాఫత్ నాయకులు తమ ప్రాబల్యంగల ప్రాంతాలను, పాలనా సౌలభ్యం కోసం విభజించుకున్నారు. ఈ విధంగా పాలన చేసిన వారిలో మౌల్వీ అలీ ముస్సలియార్, హజీ కున్నాథ్ కున్హా అహమ్మద్, నీతికొయా తంగల్, చెంబ్రాశరీ ఇంబిచ్చి కోయా తంగల్ లాంటి వారిని పేర్కొనవచ్చు, ఈ నేతలంతా తమకు పట్టుగల ప్రాంతాలను ప్రత్యేక రాజ్యాలుగా ప్రకటించుకున్నారు.
బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసిన శ్రీ గోపాల్ నాయర్ రాసిన పుస్తకంలో హజీ కున్నాథ్ కున్హా అహమ్మద్ గురించి వివరించారు. ఈ పుస్తకాన్ని బ్రిటీష్ అధికారులు బాగా మెచ్చుకున్నారు. ఈ మెచ్చుకోలును బట్టే ఆనాడు ఆయన రాసిన అంశాలు తప్పకుండా ఉద్యమకారులకు వ్యతిరేకంగా ఉంటాయన్నది నిర్వివాదాంశం. అయినప్పటికీ అందులో కూడా కొన్ని వాస్తవాలు చెప్పక తప్పలేదు. ఆ వివరాల ప్రకారం '.. వారియర్ కున్నాథ్ కున్హా అహమ్మద్ హాజీ