Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102 సయ్యద్ నశీర్ అహమ్మద్

ముస్సలియార్ ని ఆ ప్రాంతానికి తిరుగులేని నాయకునిగా ప్రజలు పరిగణించారు. ఆయన తక్షణమే పాలనాకార్యక్రమాల నిర్వహణను చేపట్టారు. హిందూ-ముస్లిం వివక్షతకు అతీతంగా పాలన సాగించారు. ఖిలాఫత్ రాజ్యం సాధించాలన్న లక్ష్యంతో సమర్థవంతంగా వ్యవహరించారు. బ్రిటీష్ బలగాలు తిరిగి రాక తప్పదని, ఆ బలగాలను తట్టుకుని నిలబడగల శక్తి తమకు లేదని ఆయనకు తెలుసు. ఆత్మహత్యా సదృశ్యమైన పోరాటం కంటే ప్రజల ప్రాణాలను కాపాడుకునే రాజీ మార్గం పట్ల ఆయన అనుకూలత చూపారు. ఈ విషయాలను అలీ ముస్సలియార్ తో కలిసి పనిచేసిన శ్రీ కేశవ మీనన్ వివరించారు.
⁠ఈ సంఘటనల గురించి సాగిన ప్రచారం వలన పరిసర గ్రామాలకు గ్రామాలు కదలి తిరుంగా వచ్చాయి. ఆ విధంగా 30 వేల మంది జనం తిరుంగాడికి చేరుకున్నారు. పోలీసులు పలాయనం చిత్తగించటంతో ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగి, ఎటువంటి భయంకర పరిస్థితులనైనా ఎదుర్కోటానికి సిద్ధం అయ్యారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మౌల్వీ అలీ ముస్సలియార్ రానున్న ప్రమాదాన్ని పసికట్టారు. కాలికటకు వెళ్ళి పోలీసులు పెద్ద సంఖ్యలో తిరిగి తిరుంగాడి రాగలరని, మరింత కిరాతకంగా వ్యవహరించగలరని ఊహించారు. నాయకుల వలన, ప్రధానంగా తన వలన ప్రజలు ప్రాణాలు కోల్పోవటం సరికాదని భావించిన అలీ ఆలోచనలో పడ్డారు. సహచరులతో సంప్రదించారు. చర్చలకు సిద్ధమన్నారు. అప్పటికే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు శ్రీ కేశవ మీనన్, మహమ్మద్ అబ్దుర్రెహమాన్, శ్రీ యు. గోపాలరావు, మౌల్వీ ఇ. మైదూ తదితరులు మరింత హింసాకాండ, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ సమయంలో అలీ ముస్సలియార్ అనుచరులతో కలిసి చర్చలకు వచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో రాజీకి సిద్ధమయ్యారు. ఆయన అనుచరులు అందుకు అంగీకరించకుండా, శత్రువుతో పోరాడుతూ వీరమరణం పొందడానికి సిద్ధమయ్యారు. చర్చలు సాగలేదు.
⁠ఆగస్టు 28వ తేదీన భారీ సంఖ్యలో తిరుంగాడి చేరుకున్న పోలీసు బలగాలు, మౌల్వీ అలీ ముస్సలియార్, అనుచరులు బసచేసియున్న తిరుంగాడి జుమా మసీదును చుట్టుముట్టాయి. కందకాలు సిద్ధంచేసుకుని, ఆగస్టు 30వ తేదీన కాల్పులు ప్రారంభించాయి. మసీదు లోపల 114 మంది అనుచరులతో మౌల్వీ చిక్కుబడిపోయారు. పోలీసు కాల్పుల ఫలితంగా 22 మంది మరణించగా చాలామంది తప్పించుకున్నారు. ఈ పోరాటంలో బ్రిటీష్ పోలీసు బలగాలలో 20 మంది చనిపోయారు. చివరకు మౌల్వీ అలీ ముస్సలియార్ పాటుగా 32 మంది లొంగిపోయారు. ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసింది. మౌల్వీ ఆయన అనుచరులకు న్యాయవాదిని నియమించుకోడానికి, తమ వాదన విన్పించుకోడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ విచారణ తంతు తరువాత మౌల్వీతో పాటుగా 12 మందికి ఉరిశిక్ష విధించారు. ముగ్గురిని అండమాన్ దీవులకు పంపారు. మిగిలిన 33 మందికి, జీవిత ఖైదును ఖాయం చేసారు. ఈ విషయాలన్నిటినీ శ్రీ కేశవ మీనన్ తన కలిన్నా కాలం ' అను గ్రంథంలో పేర్కొన్నారని ENCYCLOPAEDIA OF MUSLIM BIOGRAPHY, [APH PUBLISHING CORPORATION (2001) సంకలన కర్త NAGENDRA KUMAR SINGH వివరించారు. ఈ ఉరిశిక్ష అమలుకాకముందే మౌల్వీ