101 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు
యఫ్.బి. ఇవాన్స్ తన నివేదికలో పేర్కొన్నాడు.
చివరకు మౌల్వీ అలీ ముస్సలియార్ను అరెస్టు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఆయన కోసం కాలికట్ నుండి ప్రత్యేకంగా వచ్చిన పోలీసు బలగాలు వేట ప్రారంభించాయి.
ఆగస్టు 19వ తేదీ రాత్రి జిల్లా కలెక్టర్, డి.యస్.సి. హిచ్ కాక్ , పోలీసు ఉన్నతాధికారులు
తమ బలగాలతో తిరుంగాడి చేరుకున్నారు. గ్రామాన్ని చుట్టుముట్టి మౌల్వీ అలీ, ఇతర
నాయకుల కోసం ప్రార్థనాలయాలు, గృహాలను సోదా చేశారు. ప్రముఖ ఖిలాఫత్ నేతలు
లవకుట్టీ, కున్హల్వీ, ఖాదర్ మొహిద్దీన్లాంటి వారెవ్వరూ పోలీసులకు చిక్కలేదు. ఆయుధాలు
ఉన్నాయన్న నెపంతో వారి గృహాల మీద దాడులు జరిపినా ఎక్కడా ఏమీ దొరకలేదు.
చివరకు నిద్రపోతున్న ఓ ముగ్గురు సామాన్య కార్యకర్తలను మాత్రం అదుపులోకి తీసుకుని
తీరుంగాడి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తీరుంగాడి ప్రజలు
పోలీసు స్టేషన్ వద్ద గుమికూడగా, ఖిలాఫత్ నాయకుడు కె. యం. మౌల్వీ సర్ది చెప్పి పంపివేశారు.
కాని పోలీసు బలగాలు పంరప్పన్ గుడి సమీపాన గల టానూర్ అనుచోట గుమికూడిన
జనం మీద ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో
నలుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటనతో ప్రజలు బాగా
రెచ్చిపోయారు.
ఈ విషయం ఇలా వుండగా ఆగస్టు 20న మౌల్వీ ముస్సలియార్ను అరెస్టు చేయడానికి
పోలీసులు వచ్చారని తెలిసి ఆగ్రహించిన ప్రజలు తమ ప్రియతమ నాయకుని అరెస్టును
ప్రతిఘటించేందుకు అందిన ఆయుధమల్లా తీసుకుని తిరుంగాడి చేరుకున్నారు. తిరుంగాడి
మసీదు, అక్కడ వున్న మరో పవిత్ర స్థలాన్ని బ్రిటీష్ బలగాలు కూలగొట్టారని సాగిన ప్రచారం
ప్రజలలో మరింత ఆగ్రహానికి కారణమైంది.
ప్రముఖ ఖిలాఫత్ నాయకుడు మౌల్వీ కున్ ఖాదర్ (Kunyi Kadar) నాయకత్వంలో
తిరుంగాడి పట్టణానికి వస్తున్న మూడువేల మంది ప్రజలను బ్రిటీష్ పోలీసులు అడ్డుకుని
కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన జరుగుతుండగానే
మరోవైపు నుండి ప్రజలు పోలీసు బలగాల మీద పడ్డారు. ఆ ప్రజలను పోలీసులు
నిలువరించకలేక అచేతనులయ్యారు. ఆయుధాలు కలిగియున్నా కూడా, తండోపతండాలుగా
తరలి వస్తున్న ప్రజలను ఎదుర్కొవడం పోలీసు తుపాకులకు అసాధ్యమైంది. పరిస్థితులు
విషమించటం గమనించిన అధికారులు గత్యంతరంలేక సమీపంలోని న్యాయస్థాన భవనంలో
దాక్కున్నారు. ఆ భవనాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టారు. ఆగ్రహంతో రగిలిపోతున్న
మౌల్వీ అనుచరులు ఆ భవనంలోకి ప్రవేశించి అధికారుల మీద దాడి చేశారు. ఈ సంఘటనలో
జిల్లా కలెక్టర్, మరో పోలీసు ఉన్నతాధికారి మరణించారు. ప్రజలు తరుముతుండగా బ్రతుకు
జీవుడా అంటూ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు బలగాలు తిరుంగాడి నుండి
కాలికట్ కు దౌడు తీసాయి. ఈ సంఘటనకు కారకుడని మోప్లా నాయకుడు మౌల్వీ కున్అయ్యి
ఖాదర్ (Kunyi Kadar) ను పోలీసులు అరెస్టు చేసి, విచారణ తంతును జరిపించి, బ్రిటీష్
ప్రభుత్వం ఆయనను ఉరితీసింది.
పోలీసు బలగాలు ఎప్పుడైతే పత్తా లేకుండా పారిపోయాయో మౌల్వీ అలీ