సయ్యద్ నశీర్ అహమ్మద్ 100
ఈవిధంగా పలు ప్రాంతాలలో మోప్లాలు పోలీసు బలగాల మీద, సైనికుల మీద,
ప్రభుత్వ అనుకూల వర్గాల మీద, ఖిలాఫత్ -సహాయ నిరాకరణోద్యమ వ్యతిరేకుల మీద
పైచేయిగా ముందుకు సాగుతున్న సమయంలో, ప్రజల గౌరవాభిమానాలను సొంతం చేసుకున్న
మౌల్వీ అలీ ముస్సలియార్ మీద ప్రభుత్వం కన్ను పడింది. ఆయన అరెస్టు చేయాలని
నిర్ణయించిన ప్రభుత్వం తత్ఫలితంగా ఉత్పన్నమయ్యే అవాంఛనీయ పరిస్థితును
ఎదుర్కొనడానికి కాలికట్ నుండి ప్రత్యేకంగా సాయుధ పోలీసు బలగాలను భారీ సంఖ్యలో
రప్పించింది.
మౌల్వీ అలీ ముస్సలియార్
మౌల్వీ అలీ ముస్సలియార్ 1853లో తూర్పు మంజేరిలోగల పండిక్కడ సమీపాన
గల నెల్లిక్కుట్టులో జన్మించారు. తండ్రి ఇరిక్కున్నన్ పల్లట్టు మలయాలి కుంచి మొహిద్దీన్,
తల్లి అమీనా. నెల్లిక్కుట్టులో ప్రాథమిక స్థాయి ధార్మిక విద్యను పూర్తి చేసిన ముస్సలియార్
ఉన్నత విద్యకోసం మక్కా వెళ్ళారు. మక్కా నుండి తిరిగి వచ్చాక, లక్ష దీవులలోని కనారట్టి
ద్వీపంలోని ఒక పాఠశాలలో ప్రధానాచార్యుడిగా చేరారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో
మలబార్ ని తన కుటుంబీకులు 1894 మే 24న బ్రిటీష్ బలగాలతో పోరాడుతూ ప్రాణాలు
విడిచిన సమాచారం అందుకుని స్వస్థలానికి వచ్చేశారు. 1897లో జరిగిన మరొక పోరాటంలో
మిగిలిన కుటుంబ సభ్యులు కూడా బ్రిటీష్ పోలీసుల ఊచకోతకు గురయ్యారు. ఆ సంఘటనతో
మోప్లా రైతు జనావళి పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్న తెల్ల పాలకులను ఎలాగైనా
తరిమివేయాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో కరడుగట్టిన
బ్రిటీష్ వ్యతిరేకిగా, జాతీయ భావాలను నరనరాన నింపుకున్న పచ్చి జాతీయవాదిగా ఆయన
రూపాంతరం చెందారు.
ఈ మధ్య కాలంలో ఆయన అనేక విద్యా సంస్థలలో పనిచేసారు. 1907లో
తిరుంగాడిలోని ప్రముఖ విద్యాసంస్థకు అధిపతిగా నియమితులయ్యారు. విద్యార్థులకు ధార్మిక
మార్గదర్శకత్వంతో పాటుగా బ్రిటీష్ వ్యతిరేకత నూరిపోసారు. 1916 ప్రాంతంలో
జాతీయోద్యమ పవనాలు వీచటంతో ఆ బాటను అందిపుచ్చుకున్నారు. 1920లో తిరుంగాడి
పట్టణ ఖిలాఫత్ కమిటీ ఏర్పడినప్పుడు పి.యం. పుక్నోయా తన్నల్తో పాటుగా అలీ
ముస్సలియార్ కూడా కమిటీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయన సమర్థవంతమైన
నాయకత్వం, ఆదర్శవంతమైన మార్గదర్శకత్వంలో తిరుంగాడి పట్టణ సమీప గ్రామాలలో
ఖిలాఫత్ కమిటీలు ఏర్పడ్డాయి. ఆయన ప్రత్యేక శిక్షణలో కార్యకర్తలు సుశిక్షితులుగా
తయారయ్యారు. కార్యకర్తలకు ప్రత్యేక దుస్తులు నిర్దేశించారు. ప్రతి శుక్రవారం ఆయన
అనుచరులు, నిర్దేశించిన దుస్తులతో ఎంతో క్రమశిక్షణతో ప్రార్థనలకు రావటం, తిరిగి
వెళ్ళటం జరిగేది. ఆ రోజున జరిగే ప్రసంగాలలో తుపాకీ తూటాల్లాంటి మాటలతో బ్రిటీష్
పాలకుల మీద ఆయన విరుచుకుపడేవారు. బ్రిటీష్ ప్రభుత్వం కూలిపోతుందనీ, గాంధీజీ,
అలీ సోదరులు తమకు సహాయపడతారని, ప్రజలంతా గాంధీజీకి, అలీ సోదరులకు తోడ్పాటు
అందించాలని, బ్రిటీష్ న్యాయస్థానాలను బహిష్కరించాలని, బ్రిటీష్ అధికారులను అంతం
చేయాలని, మౌల్వీ ముస్సలియార్ ఆ ప్రసంగాలలో నొక్కి చెప్పేవారని బ్రిటీష్ అధికారి