పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్బాదుల్లా డైరెక్టర్‌ తెలుగు ఇస్లామిక్‌ పబ్లికేషన్స్‌ సందేశభవనం, లక్కడ్‌కోట్ ఛత్తాబజార్‌, హైదారాబాద్‌-2

ప్రచురణకర్త పలుకులు

ప్రముఖ రచయిత శ్రీ సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌గారు రచించిన 'భారత స్వాతంత్య్రోద్యామం-ముస్లింలు' అను ఈ పుస్తకం స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్రకు అద్ధం పడుతుంది.చరిత్ర పరిశోథకుడు నశీర్‌ అహ్మద్‌ రాసిన ఈ పుస్తకం భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను అవగాహన చేసుకోవడనికి ఎంతగానో సహకరిస్తుంది.

ఈ పుస్తకం తొలుత 'ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌' ద్వారా 1999లో ప్రచురితమైంది. ఆ సందర్భంగా లభించిన పాఠకాదారణ వలన 2003లో పునర్ముద్రణ అయ్యింది. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింలు నిర్వహించిన పాత్ర గురించి తెలుగులో ప్రత్యేకంగా పుస్తకం ఏమీ లేకపోవటంతో ఈ పుస్తకానికి పాఠకుల, పండితుల ఆదారణ విశేషంగా లభించింది. ఆ కారణంగా మరిన్ని మార్పులు చేర్పులతో, అమూల్యమైన పలు చిత్రాలు సమకూర్చుకుని మూడవసారి ముచ్చటగా ప్రస్తుతం మీ ముందుకు వచ్చింది.

శతాబ్ధాలుగా మన దేశంలో కలసిమెలసి సహజీవం సాగిస్తున్న వివిధ సాంఫిుక జన సముదాయాలు తమ తమ పూర్వీకులు మాతృదేశ విముక్తి కోసం,ఆ తరు వాత స్వంతగడ్డ ప్రగతి కోసం చేసన త్యాగాలను, సాగించిన కృషిని పరస్పరం తెలుసుకుంటే, ఒకరి పట్ల మరొకరికి గౌరవభావం ఏర్పడుతుంది. ఆ గౌరభావం నుండి ఆయా సముదాయాల పట్ల సదావగాహన, సధ్బావన పరిఢవిల్లుతాయి. ఆ సద్భావన నుండి సహిష్ణుత ఉద్భవిస్తుంది. ఆ కారణంగా మత సామరస్యం మరింత పటిష్టం కాగలదని ఆశిస్తూ...

- అబ్బాదాుల్లా 4