Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

నాగరికతలు అవిభాజ్యమైనవి. అవి మతం పేరిట విభజనకు గురికావు అన్నాడు. అందుకు ఆయనోక ఉదాహరణ కూడాఇచ్చారు. అ ఉదాహరణ ప్రకారంలో ఓ కర్ర ముక్కను నీళ్ళతో నిండిన బక్కెట్టులో వాలుగా ముంచితే ఆ కర్ర విరిగి రెండు భాగాలైనట్టుగా కన్పిస్తుంది. నిజానికి కర్ర మాత్రం యధాతధాంగా ఉంటుందని ఆయన వివరించారు. ( ' If we put a stick in the water, it may appear that the water has been divided but water remains the same and the moment the stick is removed, even the appearance of division disappears ' - India Wins Freedom, Moulana Abul Kalam Azad,Orient Longman, Hyderabad,1995 Page.215)

విభజనకు జాతీయవాదముస్లింల వ్యతిరేకత

1940 నుండి 1947లో స్వాతంత్య్రం సిద్ధించేంత వరకు జాతీయోద్యమానికి గాంధీ-మౌలానాల నాయకత్ఫ్వం మార్గదర్శకత్వం వహించిందనవచ్చు. ఆ సమయంలో కాంగ్రెస్‌ అద్యక్ష స్థానంలో ఉన్న ఆజాద్‌, ద్విజాతి సిద్ధాంతం, విభజన ప్రతిపాదనలు తెచ్చిపెట్టేట ప్రమాదాన్ని గ్రహించారు . అందు వలన ఆయనస్వ రాజ్యం కంటే హిందూ-ముస్లింల ఐక్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. స్వర్గం నుండి దేవదూతలు దిగి వచ్చి స్వరాజ్యమా? హిందూ-ముస్లింల మధ్యన ఐక్యతా? ముందు ఏది కావాలి అంటే నేను హిందూ మసిం మధ్యన ఐక్యతను కోరుకుంటాను. స్వరాజ్యం లభించటంలో ఆలస్యమైనా ఎటువంటి నష్టం లేదుకాని, భారత దేశంలోని ప్రధాన సాంఫిుక జనసము దాయాలైన హిందూ-ముస్లింల ఐక్యతకు విఘాతం కలిగితే అది యావత్తు మానవజాతి మనుగడకు ప్రమాదమని అభిప్రాయపడుతూ మౌలానా హెచ్చరికలు చేశారు. (‘ If an angel descends from heaven today and proclaims from the Qutub Minar that India can attain Swaraj within 24 hours provided I relinquish my demand for Hindu-Muslim Unity, I shall retort to it: ‘ No my friend, I shall give up Swaraj, but not Hindu-Muslim unity, for if Swaraj is delayed, it will be a loss for India, but if Hindu-Muslim unity is lost, it will be a loss for the whole of mankind. -Understanding Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, 1986, Page. 230)

మతం ప్రాతిపదికన విభజన కోరుకుంటున్నవిభజనవాదులు, మతం మనుషులను ఏకం చేస్తుందటూ చేస్తున్న వాదాన్నిమౌలానా తిప్పి కొడుతూ, భౌగోళికంగా, ఆర్థికంగా, భాషాపరంగా, సంస్కతిృ పరంగా వేర్వేవేరుగా ఉన్న మనుషుల్ని మతం ఐక్యం

63