పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

నుండి ఈ భావం 1886 లో తొలిసారిగా పుట్టుకొచ్చింది. హిందూ మత ప్రముఖులు శ్రీ రాజ్‌నారాయణ బసు 1864లో హిందూ మేళా పేరుతో ఆ ప్రస్తావన తెచ్చారు. ఆ తరువాత 1923లో హిందూ మహాసబకు చెందిన భాయి ప్రేమానంద్‌ ఆ అభిప్రాయానికి మద్దతు పలికారు. హిందూ- ముస్లింల జనసముదాయాల ఆధిక్యతను బట్టి వేర్వేరు ప్రాంతాలుగా విభజించాలని ఆయన సూచించారు.

జాతీయ కాంగ్రెస్‌ ప్రముఖులు లాలా లజపతిరాయ్‌ ట్రిబ్యూన్‌ అను ఆంగ్ల పత్రికలో వరుసగా (26th November నుండి 17th October 1924 వరకు) రాసిన 12 వ్యాసాలలో, హిందూ-ముస్లింలు వేర్వేరు జాతులని, ఈ రెండు జాతులు కలసిమెలసి జీవించటం సాధ్యం కాదని, అందువలన వేర్వేరుగా ఉండటం మేలన్న విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

1930లో ఖ్వాజా అబుర్రహీం అను వ్యక్తి తొలిసారిగా పాకిస్థాన్‌ అను మాటను ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో 1940లో ముస్లిం లీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని రంగం మీదకు తీసుకొచ్చింది. ఒకప్పుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన రహమత్‌ అలీ అను విద్యార్థి చేసిన పాకిస్థాన్‌ ప్రతిపాదనను ' ..its a wild musing of an irresponsible student .' . అని svaయంగా కొట్టిపారేసిన మహమ్మద్‌ అలీ జిన్నా లాహోర్‌ సమావేశంలో పాకిస్ధాన్‌ తీర్మానం చేయించారు. అప్పటి నుండి పాకిస్థాన్‌ ఏర్పాటు ప్రతిపాదన ఊపందుకుని చివరకు విభజనకు కారణమైంది.

1940లో రాంఘర్‌లో మౌలానా అజాద్‌ అద్యక్షతన జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. మతానికి ద్యితీయ స్థానం కల్పిస్తూ ఆయన ప్రసంగించారు. ఈ మేరకు ఆయన తీర్మానాలు చేయించారు. ఈ తీర్మానాలు పట్ల ముస్లింలీగ్ తీవ్రంగా స్పందించింది. ఆ స్పందనే పాకిస్థాన్‌ ఏర్పాటు డిమాండ్‌గా బలపడింది. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ మాత్రం ఆ తీర్మానాన్నిఅంతగా పట్టించుకొలేదు.

' క్విట్ ఇండియా ' సృష్టికర్త యూసుఫ్‌ మెహర్‌ అలీ

క్రిప్స్‌ రాయబారం విఫలమైన తరువాత భారత దేశమంతా ఒకే నినాదం మారుమ్రోగింది. అదే ' క్విట్ ఇండియా ' నినాదం. ఈ నినాదం ఉద్యమంగా మారి ఉదృతరూపం ధరించింది. ఈ ఉద్యమంలో నేతలు, కార్యకర్తలు అసంఖ్యాకంగా జైళ్ళపాలయ్యారు. జైళ్ళు నిండిపోతున్నా తరలి వస్తున్న ప్రజానీకాన్ని నిలువరించేందుకు

56