పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

that the League was reorganized. Mr. Jinnah took full advantage of the situation and started an offensive, which ultimately led to Pakistan. India Wins Freedom, Maulana Abul Kalam Azad, Orient Longman, Delhi, 1995, Page 171)

ఈ మేరకు క్రమంగా బలపడిన ముస్లిం లీగ్ 1940లో లాహోర్‌లో జరిగిన సమావేశంలో తొలిసారిగా ద్విజాతి సిద్ధాంతాన్ని రంగం మీదకు తెస్తూ, పాకిస్థాన్‌ ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ తీర్మానించింది.

' లీగ్ ' విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం

1935 నాి భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్ ను మట్టికరిపిస్తూ, భారత జాతీయ కాంగ్రెస్‌ దేశవ్యాపితంగా ఘనవిజయం సాధించింది. వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో కూడా ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, అల్లా బక్స్‌ సుంర్రో, అబ్దుల్‌ సమద్‌ ఖాన్‌, డక్టర్‌ ఖాన్‌ సాబ్‌ లాంటినేతల ప్రాబల్యం వలన జాతీయ కాంగ్రెస్‌ ఆధిపత్యాన్నినిలబెట్టుకుంది. ఈ నేతలంతా లీగ్ మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించి, చివరి క్షణం వరకు ముస్లింలీగ్ కు ఎదురు నిలిచి, ద్విజాతి సిద్ధ్దాంతాన్ని, దేశ విభజన ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకించారు.

ఆ కారణంగా అల్లా బక్స్‌ సుంర్రో లాంటి లౌకిక ప్రజాస్వామ్య వాదులు స్వాతంత్య్రానికి ముందు డాక్టర్‌ ఖాన్‌ సాహెబ్‌ తరువాత కూడా మూడు దశాబ్దాలకు పైగా జైలు, ప్రవాస జీవితం గడపాల్సి వచ్చింది. 'బెలుచీ గాంధీ' గా పేర్గాంచిన అబ్దుస్‌ సమద్‌ ఖాన్‌ అనేక సంవత్సరాలు కారాగారాన్ని అనుభవించారు. డాక్టర్‌ ఖాన్‌ సాబ్‌ అఖండ అధిపత్యంలో ఏర్పాటు చేసన ప్రజా ప్రబుత్వాన్ని పలుసార్లు రద్దు చేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నారు.

జిన్నాకంటే ముందే ద్విజాతి సిద్ధాంతం

ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా ఆలోచనల నుండి మాత్రమే ప్రప్రధమంగా ద్విజాతి సిద్ధాంత భావాలు ఉద్భవించ లేదు. ముస్లిం వ్యతిరేకత

55