పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

ఈ నేతలంతా ఒకవైపున జాతీయ కాంగ్రెస్‌లో సబుబ్యులుగా కొనసాగుతూ, కార్మికుల సంక్షేమం కోసం

జరుగుతున్న ఉద్యమాలలో కీలకపాత్ర వహించారు. ఆ కృషిలో ముజఫర్‌ అహమ్మద్‌, షౌకత్‌ ఉస్మాని లాంటివారు జైలుశిక్షలకు కూడా గురయ్యారు. బ్రిటిష్‌

ప్రభుత్వంఈ నాయకులో పలువురి మీద అనేక కుట్ర కేసులను నమోదుచేసి జైలు పాల్జేసింది. కమ్యూనిజం వైపు మొగ్గుచూపిన విప్లవ భావాలుగల వీరంతా కలసి భారత కమ్యూనిస్టు పార్టీని భారతదేశం ముజఫర్‌ అహమ్మద్‌ అవతలి భూభాగంలో ప్రారంభిచిన తొలి కమ్యూనిస్టులయ్యారు. ఈ చారిత్రాత్మక నిర్మాణంలో అబ్దుల్‌ రబ్‌ పేష్వారి, ముహమ్మద్‌ అక్బర్‌ ఖాన్‌, మియా అఖ్తర్ షా, అజీజ్‌ అహమ్మద్‌, అబ్దుర్‌ రషీద్, అబ్దుల్‌ రహమాన్‌,

ె అబ్దుల్‌ వాహెద్‌, అబ్దుల్‌ కరీం, అబ్దుల్‌ ఖాశిం, అబ్దుల్‌ ఖాదిర్‌, అబ్దుల్‌ ఖాదార్‌ ఖాన్‌, అబ్దుల్‌ బారి, అబ్దుల్‌ మజీద్‌, అబ్దుల్‌ మాలిక్‌, అబ్దుల్‌ హమీద్‌, అబ్దుల్లా మొహమ్మద్‌, అబ్దుల్లా అన్సారి, అబ్దుల్లా ఖాన్‌, హాజరా ఆపాప్రొఫెసర్‌ మహమ్మద్‌ హది, ప్రొఫెసర్‌ అహమ్మద్‌ హది, అబ్దుల్‌ జబ్బార్‌ ఖాద్రి, అబ్దుల్‌ సత్తార్‌ ఖాద్రి, ష్ధకత్‌ ఉస్మాని, జఫర్‌ ఇమామ్‌, పెజుల్లా మొహమ్మద్‌ తదితరులు ఉన్నారు. కార్మిక కర్షకుల నేతలుగానే కాకుండా ఆయా వర్గాల సంక్షేమాన్ని సౌభాగ్యాన్ని కోరే వ్యక్తులుగా కూడా అనేకమంది కళాకారులు, కవులు, రచయితలు ఆనాడు ముందుకొచ్చారు. వీరిలో ముజఫర్‌ అహమ్మద్‌, ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం, సజ్జాద్‌ జహిర్‌, సర్దార్‌ అలి జాఫ్ర, కె.ఎ. అబ్బాస్‌ మన రాష్ట్రా నికి చెందిన మక్దూం మొహిద్దీన్‌ లాంటి ప్రముఖులు మక్దూం మొహిద్దీన్‌ ఉన్నారు.

51