పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

జలాలుద్దీన్‌ అహమ్మద్‌ బెంగాల్లో విప్లవ కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించారు.

బ్రిటిష్‌ కుయుక్తులను ఎండగడుతూ దేశీయులను పోరుబాట దిశగా ప్రోత్సహించేందుకు మౌలానా ఆల్‌-హిలాల్‌ పత్రికను నడిపారు. అనుశీలన సమితిలో సభ్యత్వంతీసుకున్నారు. అజాద్‌ను ప్రమాదకర వ్యక్తి గా బ్రిటిష్‌ ప్రభుత్వం ఆనాడు పరిగణించింది. అనంతర కాలంలో ఆజాద్‌ అహింసా మార్గం పట్ల ఆకర్షితులై జాతీయ కాంగ్రెస్‌లో సభ్యులయ్యారు. అచిరకాలంలో అగ్రనాయకులుగా ఎదిగారు.

ఆజాద్‌తోపాటుగా ఆనాడు జనాబ్‌ ముహమ్మద్‌ ఆలీ కామ్రేడ్‌, హందర్ధ్‌ అను పత్రికలను, జనాబ్‌ వహీదుద్దీన్‌ సలీం ది ముస్లిం గజిట్, జనాబ్‌ జఫర్‌ ఆలీఖాన్‌ జమీందార్‌ లాంటి పత్రికలను నడిపారు. ఈ పత్రికలపై కన్నెర్ర చేసిన బ్రిటిష్‌ ప్రబుత్వం దారుణమైన దాడులు జరిపి, సంపాదకులను, ప్రచురణకర్తలను, జైళ్ళ పాల్జేసింది. మాతృభూమి స్వేచ్ఛా-స్వాతంత్య్రాల కోసం అక్షరాలతో పరాయిపాలకుల మీదయుద్ధం ప్రకటించిన పత్రికలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి నిషేధించింది.

గాంధీజీ ప్రాణాలను కాపాడిన బతఖ్‌ మియా అన్సారి

బీహార్‌లోని చంపారన్‌ నీలి మందు తోటల సాగుదారులైన రైతులను పలు రకాల పన్నుల పేరిట దోపిడి చేస్తున్న ఆంగ్లేయ ప్లాంటర్ల అకృత్యాలను, రైతుల బాధల గాధలను వృత్తిరీత్యా ఉపాధ్యాయుడెన పీర్‌ మహ్మద్‌ మునిన్‌ తన వార్తల ద్వారా ప్రదమంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.

1916లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో ఆయన గాంధీజీని స్వయంగా కలసి రైతుల ఇక్కట్లను వివరించారు. ఆ సమయంలో అక్కడి రైతులను సంఘటితపర్చి, ప్లాంటర్ల దుష్ట పన్నాగాలను ఎదుర్కొంటూ షేక్‌ మహమ్మద్‌ గులాబ్‌ అను యువకుడు రైతాంగ ఉద్యమాన్ని నడుపుతున్నారు.

ఆ రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మహాత్మాగాంధీ చంపారన్‌ వెళ్ళారు. రైతుల పక్షాన విచ్చేసిన ఆయనను అంతం చేయాలని ఫ్లాంటర్లు కుట్ర పన్నారు. ఆ కుట్ర నిర్ణయం మేరకు ఆయనకు విషమిచ్చి చంపేందుకు మోతిహరి గ్రామానికి చెందిన బతఖ్‌ మియా అన్సారి అను చిరు ఉద్యోగిని భయపెట్టిబలవంతంగా ఒప్పించారు. మాట వినకుంటే ఆయన కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించటంతో అన్సారి అంగీకరించినట్టు నటించి అప్పటికి ఆ గండం నుండి బయటపడ్డారు.

37