పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

1916లో దేవ్‌బంద్‌ విప్లవకారులు గదార్‌ వీరులు కలసి తొలి svaతంత్ర భారత ప్రభుత్వాన్ని ఆఫ్గానిస్తాన్‌లో ఏర్పాటు చేశారు. ఈ ప్రవాస భారత ప్రభుత్వానికి జర్మనీ, టర్కీ తదితర దేశాల మద్దతును కూడా ఆ విప్లవకారులు సంపాదించారు. ఈ ప్రబుత్వానికి అధ్యక్షులుగా శ్రీ రాజామహేంద్రవర్మ, ప్రధానమంత్రిగా డాక్టర్‌ బర్కతుల్లా, ఉపప్రధాన మంత్రిగా సయ్యద్‌ ఒబేదుల్లా సింధీ వ్యవహరించారు. ఈ వీరులతో హైదారాబాద్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ చేతులు కలిపారు.

1917 నాటి మాండలే కుట్రకేసులోని భారతీయ సైనికులలో ముస్తఫా హుస్సేన్‌, అమర్‌సింగ్, ఆలీ అహమ్మద్‌లు ముఖ్యులు. పలు ప్రాంతాలలో భారతీయ సైనికులు చేసిన తిరుగుబాట్లను బ్రిటిష్‌ ప్రభుత్వం ఉక్కుపాదాలతో అణిచి వేసింది.

మౌలానా ఆజాద్‌ రంగప్రవేశం

ఈ పరిస్థితులు గదర్‌ పార్టీకి, విప్లవ గ్రూపులకు అశనిపాతమయ్యాయి. విప్లవకారులంతా శిక్షలకు గురి కావటంతో అగ్నియుగం తొలిదశ అంతమైంది. అగ్నియుగం యోధుల వీరోచిత త్యాగాల స్పూర్తితో పలువురు యువకులు, విద్యార్థులు మాతృదేశ విముక్తి కోసం ప్రారంభమైన పోరాటంలో షహీద్‌ కావానికి కద లి వచ్చారు. అటువంటి వారిలో మౌలానా ఆబుల్‌ కలాం అజాద్‌ ఒకరు. ఆయన కూడా తనదైన 'దారుల్‌ ఇర్షాద్‌' అను విప్లవ గ్రూపు ప్రారంభించారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలర్పించగల యువకులతో కిద్దిపూరు స్మశానంలో శపథం చేయించారు.

ఆనాడు మౌలానాకు విప్లవ గ్రూపులలోప్రవేశం అంత తేలిగ్గా లభించలేదు. ఆ కారణంగానే

ఆయన తనదై న పోరాట ద ళాన్నిఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. మౌలానా ఆజాద్‌ ముస్లిం కనుక బెంగాల్‌ విప్లకారులు తొలుత మౌలానాను విశ్వసించలేదు. చివరకు ఆ తరువాత ఆయనలోని విద్వత్తు, సామర్థ్యాన్ని గమనించిన విప్లవకారుల దళాలు ఆయన సూచన మేరకు తమ విప్లవ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు విస్తరించేశాయి.మౌలానా ప్రముఖ అనుచరుడిగా ప్రసిద్ధి చెందిన

ఆబుల్‌ కలాం అజాద్‌

36