పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లింలు

అబ్దుల్‌ వహబ్‌, ప్రధాన పాత్రధారులు. ప్రథమ ప్రపంచ సంగ్రామంలో జావా, సుమిత్ర, తదితర ప్రాంతాలలోనున్న బ్రిటిష్ సైనికదాళాలలోని భారతీయుల మద్దతుతో బ్రిటిష్‌ పాలనను తుదముట్టించాలన్నది గదర్‌ నేతల లక్ష్యం. గదర్‌ నాయకుల కార్యక్రమాల ఫలితంగా రంగూన్‌, సింగపూర్‌లలో భారతీయ సైనికులు తిరుగుబాటు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌ ప్రాంతాలలో సయ్యద్‌ ఒబైదుల్లా సింధీ విప్లవ గ్రూపులను నిర్వహించారు. ఈ ప్రయత్నంలో విప్లవ గ్రూపులలో కొన్ని రష్యా చక్రవర్తి సహాయం కూడా అర్థించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌కు చెందిన మౌలానా ముహమ్మదుల్‌ హసన్‌ మారర్శ కత్వంలో టర్కీ ప్రబుయత్వాధినేత గాలిబ్‌ పాషా మద్దతు తో మధ్యప్రాచ్య దేశాలలోనున్న భారతీయ సైనికులను సమీకరించి బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కూడగట్టేందుకు ఒబైదుల్లా సింధీ ప్రయత్నాలు చేశారు.

సిల్క్‌ లేఖల కుట్ర

ఈ ప్రయత్నంలో భాగంగా సిల్క్‌గుడ్డ మీదరహస్య సంకేతాలతో భారతీయ సైనికులలో తిరుగుబాటును ప్రోత్సహిస్తూ లేఖలు పంపారు. ఈ లేఖల పంపిణీ సిల్క్‌ లేఖల కుట్రగా ఖ్యాతిగాంచింది. ఆ సమయాన గాలిబ్‌ పాషా భారతీయ సైనికులకు పంపిన లేఖలు గాలిబ్‌ నామా గా ప్రసిద్ధి చెందాయి.

ఈ సిల్క్‌ లేఖ గుట్టురట్టు కావటంతో గదర్‌, దేవ్‌బంద్‌ యోధుల రహస్యాలు, కార్యకలాపాలు బహిర్గతమైపోయాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం భారతీయ సైనికులపై, విప్లవ భావాలు గల యువకులపై విరుచుకుపడింది. తిరగబడిన సైనికులందరికీ కఠిన శిక్షలు విధించింది.అనేక మందిని కాల్చివే శారు . ఉరితీశారు .ద్వీపాంతరవాస శిక్షలకు గురి చేశారు. ఈ క్రమంలోభాగంగా 1915 నాటిసింగపూర్‌ తిరుగుబాటులోపాల్గొన్నం దుకు ఉరిశిక్ష విధించ బడిన రసూలుల్లాఖాన్‌, ఇంతియాజ్‌ అలీ, రుక్ముద్దీనలు పశ్చాత్తాప ప్రతి పాదానను తిరస్కరించి వీరోచితంగా ఉరినిమౌలానా ఒబైదుల్లా సింధీస్వీకరించారు.

35