పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింలు


బ్రిటీష్‌ పాలకులు ఆ పత్రిక సంపాదకులైన మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ను 1858లో అరెస్టు చేసి దారుణ చిత్రహింసలకు గురిచేసి హత్యగావించారు. ఈ విధంగా పత్రికాస్వేచ్ఛకై ప్రాణాలర్పించిన తొలి పాత్రికేయులుగా ముహమ్మద్‌ బాకర్‌ చరిత్రలోనిలిచిపోయారు. ఆనాటి పత్రికలన్ని విదేశీ పాలక శక్తుల మీద తమ అక్షరాయు ధాలను ప్రయాగించటంతో భీతిల్లిన పాలకులు పత్రికలను నిషేధించి, సంపాదకులను, ప్రచురణ కర్తలనేకాక, పాఠకులను కూడ తీవ్ర నిర్బంధాలకు గురి చేశారు. ఈ కారణంగానే 1853 నాటికి ఉన్న 35 ఉర్దూ పత్రికలు కాస్తా 1858 నాికి 12 తగ్గిపోయాయంటే బ్రిటిష్‌ పాలకులుఎంత క్రూరంగా వ్యవహరించారో తేలిగ్గానే ఊహించ వచ్చు.

ముస్లింల ఊచకోత

ప్రదమ స్వాతంత్య్ర సమరాన్ని ప్రారంభించినవారు, పాల్గొన్నవారు, ప్రోత్సహించిన వారు ప్రధానంగా ముస్లింలే నన్న అభిప్రాయానికొచ్చిన బ్రిటిష్‌ పాలకులు 27 వేలమంది ముస్లింలను వివిధ ప్రాంతాలలో ఉరితీశారని చరిత్ర రికార్డులు చెబుతున్నాయి. ఈ సంఖ్య కంటే అనేక రెట్లు ఆనాడు జరిగిన సామూహిక హత్యాకాండంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండి ముస్లిం కులీన వర్గాలతోపాటు, సామాన్య ప్రజానీకాన్నికూడ అన్ని విధాలుగా కృంగదీసి నిర్వీర్యం చేసేందుకు అనువైన పథకాలు,విధానాలు బ్రిటీష్‌ పాలకులు అమలుపర్చారు. ఆనాడు అమలు చేసిన పథకాలు

27