పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


ఆరెస్టు చేసి ద్వీపాంతర వాసానికి పంపారు. ఆ క్రమంలో సయ్యద్‌ అహమ్మద్‌ 1857 జులై 17న పోరుసల్పుతూ ప్రాణాలు విడిచారు. బోయనపల్లిలో బ్రిటీష్‌ సైనికాధికారి కల్నల్‌ డేవిడ్‌సన్‌ను చంపే ప్రయత్నంలో జహంగీర్‌ ఖాన్‌ అను మరో యోధుడు కాల్చివేయబడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం బ్రిటీషు సైన్యంలో సైనికాధికారిగా పనిచేస్తున్న సుబేదార్‌ అహమ్మద్‌ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటులో అహమ్మద్‌ వెంట నడిచిన తిరుగుబాటు సిపాయీలందర్నిఆయన కళ్ళ ముందే కాల్చి చంపేశారు. చివరకు సుబేదార్‌ అహమ్మద్‌ను ఫిరంగి గొట్టపు రంధ్రానికి కట్టి పేల్చి వేశారు. ఈ మేరకు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా సాగిన పలు పోరాటలలో పాల్గ్గొన్న యోధులు ఎంతో మంది ఉన్నారు. ఈ వీరులంతా తెలుగు గడ్డకు చెందినవారు కావటం గర్వించదగిన అంశం.

పాత్రికేయుడు మహమ్మద్‌ బాకర్‌ త్యాగం

1857లో నాి ప్రథమ స్వాతంత్య్రోద్యమంలో ఆనాటి పత్రికలు కూడ బృహత్తరమైన పాత్రను నిర్వహించాయి. ఆనాడు ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగానూ, ఇతర ప్రాంతాల నుండి 'ఢిల్లీ అక్బార్‌', 'కొహినూర్‌', ' తారిఖ్‌-ఎ-భగవత్‌-ఎ-హింద్‌ ', 'ముషిర్‌-ఎ-దక్కన్‌ ', 'వకీల్‌' వంటి పలు పత్రికలు బ్రిటీష్‌ వ్యతిరేకతను ప్రజానీకంలో ప్రోది చేస్తూ సాహసవంతమైన పాత్రను పోషించాయి.

ప్రథమ స్వాతంత్య్ర సమరానికి తిరుగులేని మద్దతునిస్తూ తిరుగు బాటుదార్లలో బ్రిటీష్‌ పాలకుల పట్ల తీవ్ర ప్రతిఘటన జ్వాలలను మండించింది ఢిల్లీ అక్బార్‌ పత్రిక.

26