పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు

ప్రచారంగావించే శక్తులకు, ఈ గ్రంథాలు ప్రదానంగా ఆధారం అవుతున్నాయి. ఆంగ్లేయ వలసపాలకులు తమ కుటిల ప్రయత్నాలతో దేశాన్ని చీల్చగలిగేంత వరకు విజయం సాధించినా, భారతీయుల ఐక్యపోరాటాల ఫలితంగా చివరకు మూట ముల్లే సర్దుకుని పారిపోక తప్పలేదు.

ఈ మేరకు ఇలియట్, డౌసన్‌, మాల్కం, బ్రిగ్స్, ఎలిఫిన్‌ స్టోన్‌ లాంటి అధికారు లను, చరిత్రకారులను చరిత్ర వక్రీకరణకు, ప్రత్యేక చరిత్ర రచనకు నియమించారు. ఆసమయాన విలియం హంటర్‌ లాంటి అధికారులు 'ఇండియన్‌ ముస్లింలు' అను గ్రంథాన్ని రాసి ముస్లింలకు అనుకూలంగా ప్రభుత్వం చేపట్టాల్సిన పలు చర్యలును వివరిస్తూ,ముస్లింలు ప్రత్యేక జాతి జనులుగా పేర్కొన్నాడు.

తెలుగుజాతి ముద్దుబిడ్డలు

బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసిన వారిలో మన రాష్ట్రానికి చెందిన ముద్దుబిడ్డలు ఉండటం తెలుగుజాతి గర్వించదగిన అంశం. 1857లో బ్రిటీష్‌ రెసిడెన్సీ మీద సాయుధులై దండెత్తిన దాళాలకు నాయకుడు పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌, జులైలో మెదక్‌ సమీపాన బ్రిటీష్‌ సైన్యంతో పోరాటం జరిపారు. ఈ పోరులో సహచరులందర్నీ కోల్పోయిన ఆయన శత్రువు చేత చిక్కరాదన్న పట్టుదలతో ప్రయత్నించారు. శతృసైన్యాల కళ్ళుగప్పి అంతర్ధానమయ్యారు. ఆయన కోసం అన్వేషణన సాగింది. ఆయనను బంధించి అప్పగించినవారికి అప్పట్లో ప్రభుత్వం 5 వేల రూపాయలు నజరానా కూడ ప్రకటించింది. అతి ప్రయాస మీద బ్రిటీషు సైనికులు ఆయనను అరెష్ట్ చేశారు . ఆ యోధుడ్ని చిత్రహింసలకు గురి చేసి, ఉరిశిక్ష విధించారు. బ్రిటీషు వ్యతిరేక పోరుకు నాయకత్వంవహించి నందున తుర్రేబాజ్‌ ఖాన్‌పై కసితీరని బ్రిటీష్‌ పాలకులు ఆయన బౌతికకాయాన్నిప్రస్తుతం హైదారాబాదులోని సుల్తాన్‌ బజారు పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌ లో బహిరంగంగా వ్రేలాడ దీసి తమ పైశాచికత్వాన్ని చాటుకున్నారు. ఆ బాటలో నడిచి, తుర్రేబాజ్‌ ఖాన్‌కు అండదండలు అల్లావుద్దీన్‌ అండదండలు అందించిన మౌల్వీ అల్లావుద్దీన్‌ను

25