పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

ఆ పాపిష్టి సొమ్ము మా ఐక్యత ముందు దిగదుా డుపు అని ప్రజలు తిరస్క రించారు. ఆ డబ్బు కోసం మా ఐక్యతను బలి చేసేది లేదని స్పష్టంగా ప్రకంచారు. తమ ముంగిళ్ళలోకి తరలి వచ్చిన డబ్బు సంచులను తిరగ్గొట్టారు. చివరకు కంపెనీ ఖజానా నుండి దిగుమతి చేసిన సొమ్మును తిరిగి ఖజానాకు పంపించాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని T R Metcalf తన The Aftermath of Revolt అను గ్రంఢంలో , 'Sir James Outram (1803-63) failed to raise Hindus in Rohilkhand against the regime of Khan Bahadur Khan and had to return money granted for the purpose unspent to the tresury.' (page 299 ), అని పేర్కొన్నాడు.

మా మతాలు వేరైనా మా మాతృభూమి ఒక్కటే, మా మార్గం ఒక్కటే, మా లక్ష్యం ఒక్కటేననుకున్న ప్రజలు, మతం పేరిట మనుషుల్ని చీల్చి తమ పబ్బం గడుపుకొవాలనుకున్న బ్రిటీష్‌ పాలకుల ఎత్తులను త్రిప్పికొట్టారు. ఈ సందర్భంగా శత్రువుతో పోరు సాగించేందుకు ప్రజలలో వ్యక్తమైన సంసిద్ధత, వెల్లడైన ఐక్యత, బ్రిటీష్‌ అధికారులలో కంపరం పుట్టించింది.

ఈ ఐక్యతను విచ్ఛినం గావించనిదే తమ పాలనకు మనుగడలేదని గ్రహించిన పాలకులు భారత దేశంలోని ప్రధాన సాంఫీుక జనశ్రేణులైన హిందూ-ముస్లింలను మతం పేర వేరుచేయానికి ఎత్తులను, కుయుక్తులను యధేచ్ఛగా సాగించారు. బ్రిీటిష్‌పాలకులు ఎంతవరకు వెళ్ళారంటే ముస్లింల పాలనకంటే బ్రిటీష్‌ పాలన కడు మెరుగైనదన్నమానసిక భావన హిందూ జనసముదాయాలలో కలుగ జేసేందుకు చరిత్రను వక్రీకరించి రాసేందుకు పూనుకున్నారు. గత ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా చరిత్రను తిరగ రాయించుకున్నారు. అలా రాసిన చరిత్రకు బహుళ ప్రచారం కల్పించారు.

ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆంగ్ల రచయిత J.S. Grewal తన పుస్తకం Muslim Rule in India: The Assessment of British Historian (Oxford University Press, 1970) లో British adminstrators scholars, historians and missionaries all became seriously involved in making the people to believe that British rule was better than the medieval Muslim Rule.'అన్నాడు.

ఈ ప్రయత్నాలు చాలా వరకు బ్రిటీషర్లకు అనుకూల ఫలితాలనిచ్చాయి. ఆనాడు బ్రిటీషర్లకు ఉపయోగపడిన ఆ రచనలు ఈనాడు కూడ ముస్లిం వ్యతిరేక శక్తులకు ఉపయాగపడుతున్నాయి. ముస్లిం జనావళికి వ్యతిరేకంగా అపోహలు, అపార్థాలు సృషించి

24