పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


           బేగం హజ్రత్‌ మహాల్‌

భర్తీకండి... మాతృదేశం కోసం సాగుతున్నపోరాటంలో భాగస్వాములవ్వండి. శత్రువుకు సహకరించకండి.ఆశ్రయం ఇవ్వకండి...' ఆనాడు, ‘..these shortsighted individuals (the rebels) seem unmindful of the British supremacy and do their best to ruin myself and the whole country ( The Politics of a Popular Uprisings- Bundelkhand in 1857, Tapti Roy,OUP, 1994),

అంటూ ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులకు విన్నవించుకున్న ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి లభించినంత ప్రాచుర్యం బేగం హజరత్‌ మహాల్‌కు లభించలేదు.

బ్రిటిష్‌ సైన్యాలను అడుగడుగునా మట్టికరిపిస్తూ ముందుకు సాగారు మౌల్వీ అహమ్మదుల్లాషా పెజాబాది. బ్రిటీష్‌ సెన్యాలను ముప్పుతిప్పలుపెట్టిన మౌల్వీని సజీవంగా లేక నిర్జీవంగా పట్టితెచ్చిన వారికి 50వేల రూపాయల నజరానాను ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రకటించింది. ఆ భారీ నజరానా కోసం నమ్మక ద్రోహంతో ఒక విశ్వాసఘాతకుడు ఆయనను బలి తీసుకన్నాక, ఉత్తర భారత దేశంలోని ప్రధాన శత్రువు అడ్డుతొలిగింది అని బ్రిటీష్‌ సైన్యాధికారులు పండగ చేసుకున్నారు.

ఈ సందర్భంగా స్వదేశీ పాలకులలో దేశం పట్ల ప్రేమాభిమానాలను ప్రోదిచేసే లేఖలు రాసిన అజీముల్లా ఖాన్‌, మరోక మహాయోధుడు నానాసాహెబ్‌ పక్షాన పోరాటాల వ్యూహరచన చేసి శత్రువుతో అవిశ్రాంతంగా పోరాడారు. స్వయంగా పయామే ఆజాది అను పత్రికను నడిపి ఆనాటిస్వాతంత్రోధ్యమసమరయోధులకు మార్గదర్శకత్వం చేశారు. ఉత్తేజానిచ్చారు. ప్రజలలో దేశభక్తి భావనలను పెంపొందించేందుకు, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టేందుకు పయామే ఆజాది పత్రికను హిందీ, ఉర్దూ భాషల్లో అజీముల్లా ఖాన్‌ స్వయంగా ప్రచురించారు. మరాఠి భాషలో కూడ ఆ పత్రికను నడిపేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ పత్రికలో '..భారతీయ హిందువులారా, ముస్లిలారా లేవండి. సోదరులారా లేవండి. దైవం మనిషికి ఎన్నో వనరులను ఇచ్చాడు.అందులో విలువైనది స్వాతంత్య్రం..' అంటూ మొగల్‌ చక్రవర్తి బహుద్ధూర్‌ షా జఫర్‌ ప్రజలకు ఇచ్చిన పిలుపును ప్రచురించారు. మాతృ దేశాన్నికీర్తిస్తూ, బానిస బంధనాల నుండి విముక్తి కోసం పోరుబాట నడవమంటూ ప్రబోధ గీతం ఈ పత్రికలో ప్రచురిత మైంది. ఉర్దూ భాషలో ప్రచురితమైన ఆ గీతం ఇలా సాగింది.

20