పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


సుస్థిరం చేసుకునేందుకు కుట్రలు కుయుక్తులకు శ్రీకారం చుట్టి కొండచిలువలా భరత గడ్డను చుట్టేయసాగారు. కంపెనీ పాలకుల అంతరంగాన్ని గ్రహించి, రానున్న పెను ప్రమాదాన్ని ముందుగా గుర్తించి హెచ్చరించింది, ఎదుర్కొంది ముస్లింలే కావటం గమనార్హం

ప్రదమ స్వాతంత్య్ర సమరానికి వంద సంవత్సరాల ముందే బ్రిీటిష్‌ పాలకులపై వ్యతిరేకత వ్యక్తమైంది. బెంగాల్లో బ్రిీటిష్‌ వలస పాలకుల తొత్తులైన జమీందార్లకు వ్యతిరేకంగా ముస్లిం ఫకీర్లు మజ్నూషా నేతృత్వంలో 1763లో తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేశారు. ఆ సమయంలో ఫకీర్లకు తోడుగా శ్రీ భవాని పాఠక్‌ నాయకరత్వంలోని సన్యాసులు కూడ తిరుగుబాటులో పాల్గొనటంతో ఈ తొలి తిరుగుబాటు ఉద్యమం ఫకీర్లు-సన్యాసుల ఉద్యమంగా ఖ్యాతి గాంచింది. బ్రిీటిష్‌ అధికారి లార్డ్‌ మెకంజీ నేతృ త్వంలోని బ్రిీటిష్‌ సైనిక దాళాలను అనేకమార్లు ఓటమికి గురిచేసన ఫకరు -సన్యాసులు ప్రజల నుండి అపార ఆదరణ పొందారు. ఈ ఉద్యమంలో మూసాషా, చిరాగ్అలీ,నూరుల్‌ మహమ్మద్‌ తదితరులు ముఖ్య పాత్ర వహించారు. ఈ తిరుగుబాటు 1800 వరకు సాగింది.

వహాబీ- ఫరైజీల తిరుగుబాటు

తొలి తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఫకీర్లు-సన్యాసుల ఉద్యమం సమాప్తమైన రెండు దశాబ్ధాల కాలంలోనే ముస్లింలు బ్రిటీష్‌ పాలకులను ఎదిరించేందుకు మళ్ళీ సిద్ధమయ్యారు. 1820 నుంచి 1870 ప్రాంతం వరకు సాగిన ఈ తిరుగుబాటు వహాబీ ఉద్యమం గా ఖ్యాతిగాంచింది. రాయ్‌బరేలీకి చెందిన సయ్యద్‌ అహమ్మద్‌ బరేల్వీ ఈ ఉద్యమానికి ఆధ్యుడు. ఈ పోరాటానికి నాయకత్వం వహించి అమరులైన వారిలో టిటూమీర్‌, అబ్దుల్‌ అజీజ్‌, మహమ్మద్‌ మహషిన్‌, దూదూమియా,ఇనాయత్‌ అలీ, విలాయత్‌ అలీ ప్రముఖులు. ఈ యోధులు సుదీర్ఘకాలం సాగించిన పోరుకు సంబం ధించిన విజయాలను, ఆ పోరాటయోధులు పాల్గొన్నచరిత్రాత్మక సంఘటనల గురించిన బెంగాల్‌ తదితరప్రాంతాల ప్రజలు ఈ నాటికి స్మరించుకుంటున్నా రంటే, ఆ పోరాటాల ప్రాముఖ్యతను ఊహించగలరు.ఈ ఉద్యమం వహాబీ ఉద్యమంగా ఖ్యాతిగాంచింది.

16