పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు


1765లో మొఘల్‌ పాదాుషా 'షా ఆలం' బెంగాల్‌ దివానీని రాబర్ట్‌ క్లైవ్‌కు సంక్రమింపజేస్తున్న దృశ్యం

అందించిన ఆవకాశాన్ని ఉపయోగించుకుని బక్సర్‌ యుధంలో సాధించిన విజయంతో ఆంగ్లేయులు ఇండియాలో స్థిరపడగలిగారు.

ఈ క్రమంలో 1765 ప్రాంతంలో మొగల్‌ పాదాుషా షా ఆలం నుండి బెంగాలు దివానిని స్వాధీనం చేసుకున్నరు. ఈ చర్యతో పాదుషాలు నామమాత్రమైపోగా, ఆంగ్లేయుల పెత్తనం ఇండియాను పూర్తిగా ఆక్రమించుకునే దిశగా సాగింది. అనుకోని విధంగా పెత్తనం చేతికి రావటంతో, గతంలో పాదుషాలు అనుసరించిన విధానాలకు అతీతంగా, లాభాల పంటలు పండించుకుని, ఈ గడ్డ మీద నుండి అందినంత దోచుకపోడానికి కంపెనీ అధికారులు, ఉద్యోగుల ఆవురావురంటూ దోపిడికి శ్రీకారం చుట్టారు. ఈ ఆకస్మిక పరిణామాలు కొనసాగుతున్న వ్యవస్థలో అనూహ్య మార్పులకు కారణమై, అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేయటంతో ఆయా వర్గాలలో కలకలానికి కారణమైంది.

ఫకీర్లు-సన్యాసుల సమైక్య పోరాటం

భారత దేశాన వర్తకులుగా అడుగిడిన బ్రిటీషర్లు అంది వచ్చిన ఆవకాశాలను ఉపయోగించుకుంటూ క్రమక్రమంగా తమ సామ్రాజ్య విస్తరణ కాంక్షను స్వదేశీ పాలకులను ఎరచేయటం ఆరంభించారు. భారత భూభాగం మీద తమ పాలనను

15