పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


అని బెంగాలు నవాబు అల్లావర్ది ఖాన్‌ లాంటి స్వదేశీ పాలకులు హామీలు ఇచ్చినా, ఓ పథకం ప్రకారంగా గిడ్డంగుల నిర్మాణాలతో ప్రారంభమైపష్టమైన కోటలు కట్టుకుంటూ,రాజ్యాధికారం కోసం ఆంగ్లేయులు స్వదేశీ పాలకుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం ఆరంభించారు. ఆ ప్రయత్నాలలో భాగంగా బెంగాలు మీద అధిపత్యం కోసం ఆరంభించిన ఎత్తులను ఆదిలోనే గ్రహించి, ఆ కుయుక్తులను వమ్ముచేసి, ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనాన్ని రూపుమాపేందుకు పాతికేళ్ళు దాటని యువకుడు బెంగాలు నవాబు సిరాజుద్దౌలా 'భారత స్వాతంత్య్ర సాయుధ సమరేతిహాసంలో అరుణపుటల్నితెరిచాడు'. భరతగడ్డ మీద తొలిసారిగా 'బ్రిటీషు దుష్టులను కత్తిపట్టి ఎదిరించిన మొనగాడు' గా ఖ్యాతిగాంచిన ఆయన ప్రఖ్యాత ప్లాసీ యుద్ధంలో క్లయివు నాయకత్వంలోని కంపెనీ సైన్యాలను ఎదుర్కొన్నారు.

ఈ యుద్ధంలో బెంగాలు సింహాసనం కోసం ఆశపడిన సర్వసేనాని మీర్‌ జాఫర్‌, అలవికానంత సంపదను సమకూర్చుకోవాలనుకున్నదురాశాపరులు ప్రముఖ బ్యాంకరు జగత్‌ సేథి, సంపన్న వ్యాపారి అమిచంద్‌, నవాబు దార్బారులోని మరోక ప్రముఖుడు రాయ్‌దుర్లబ్‌, సేనానాయకుడు మానిక్‌ చాంద్‌, తదితరులు శత్రువుతో చేతులు కలిపి విస్వాసఘాతుకానికి పాల్పడ్డారు. ఆ కారణంగా 1757లో ప్లాసీ అను గ్రామం వద్ద జరిగిన యుద్ధంలో 50వేల స్వదేశీ సైన్యం కలిగిన సిరాజుద్దౌలా మూడు వేల బ్రిటీషు సైన్యం చేతిలో పరాజితుడయ్యారు.

ఆ తరువాత సిరాజుద్దౌలా స్థాయిలో కాకున్నా, స్వదేశీయుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న కంపెనీ పాలకుల చర్యలను, ఆంగ్లేయుల పెత్తనాన్ని, ఏమాత్రం అంగీకరించని మరొక యోధుడిగా మీర్‌ ఖాశిం రంగం మీదకు వచ్చారు. స్వదేశీ పాలకుల సహకారంతో 1764లో బక్సర్‌ అనుచోట కంపెనీ బలగాల మీదా మీర్‌ ఖాశిం విరుచుక పడ్డారు.ఈ యుద్ధంలో స్వదేశీ పాలకుల నుండి అశించినంత సహకారం లభించకపోవటం, స్వదేశీ సైనికుల కంటే, కంపెనీ సైన్యాలు చక్కని శిక్షణ కలిగియుటంతో మీర్‌ ఖాశింకు పరాజయం తప్పలేదు. 1757లో ప్లాసీ యుద్ధ విజయం

14