పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు


త్యాగాల చరిత్ర అందరికీ తెలియాలి


ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజలకు అన్ని సాంఫీుక జనసముదాయాల త్యాగాలు తెలియాల్సి ఉంది. పలు సాంఫిుక జనసముదాయాల గడ్డ అయినప్పటికి భరతభూమిలో ఆయా జనసముదాయాల మధ్యన సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఒకరి గురించి మరొకరికి తెలియాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. మాతృభూమి సేవలో పునీతమైన ప్రజలందరి చరిత్ర తెలిసినప్పుడు మాత్రమే ఆయా జనసముదాయల మధ్యన పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం సదావగాహన, సధ్బావన, సహిష్ణుతకు పునాది అవుతుంది.

ఈ వాతావరణంలో మాత్రమే లౌకిక వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మత విద్వేషాలు మట్టిలో కలసి మతసామరస్యం మరింతగా పటిష్టమమైతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలకు చేరువకాని ముస్లింల త్యాగమయ చరిత్రను ప్రజల చెంతకు చేర్చేందుకు సాగుతున్న కృషిలో చిన్న ప్రయత్నమిది.

స్వాతంత్య్రోద్యమ చరిత్రలో

అరుణపుటల్ని తెరిచిన సిరాజుద్దౌలా

16వ శతాబ్ధంలో వర్తకం పేరుతో భారత గడ్డ మీద అడుగు పెట్టిన బ్రిటీషు వర్తకులు స్వదేశీ పాలకుల దరిచేరి ధనకనక వస్తు వాహనాలను కానుకలుగా సమర్పించి,ప్రలోభపెట్టి ఈనేల మీద స్థిరపడటం ప్రారంభించారు. ఈ వర్తకుల రాకతో వ్యాపారం అభివృద్ధి చెందురతుందని ఆశించిన స్వదేశీ పాలకులు ఆంగ్లేయులకు అన్నిఅవకాశాలు కల్పించారు. సరుకును నిల్వ చేసుకునేందుకు స్వంత గిడ్డంగులు కట్టుకుంటామని స్వదేశీపాలకుల ఎదుట సాగిలపడి అనుమతి సంపాదించుకున్నారు. ఆ అనుమతుల ఆధారంగా గిడ్డంగుల రక్షణ కోసమంటూ పటిష్టమైన కోటల నిర్మాణానికి పూను కున్నారు.మీరు వ్యాపారులు. మీకు కోటల అవసరం ఏముంది? నా రక్షణలో ఉన్నందున మీకు శత్రువు గురించి ఎటువంటి భయం అక్కరలేదు

13