పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్య్రోద్యమం

ముస్లింలు


భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం ఒక మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం.దాదాపు ఒక శతాబ్దంపైగా సాగిన ఈ పోరాన్నిసుసంపన్నం చేసేందుకు జాతి,మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు పోటిపడటం అపూర్వం. లక్షలాది ప్రజానీకం ఒకే నినాదం, ఒకే లక్ష్యం కోసం ఒకే బాటన ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.

ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్నిఅందించింది. ముస్లిమేతర సాంఘిక జన సమూహాలతో మమేకమై స్వాతంత్య్రసమరంలో తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన ఆత్మబలిదానాలతో భారతీయ ముస్లింలు పునీతులయ్యారు. అయినప్పిటికీ ముస్లిం సమాజం త్యాగమయ చరిత్ర పలుకారణాల మూలంగా మరుగున పడిపోయింది. తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకుగాను బ్రిటీష్‌ పాలకులు విభజించు-పాలించు కుటిల నీతిని అమలుపర్చి భారతీయులను హిందువులు-ముసింలుగా విభజించటంలో కృతకృ త్యులయ్యారు.

భారత విభజనకు దారితీసిన పరిస్థితులు, ఆ తరువాత జరిగిన దారుణాలు, 11