పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

షానవాజ్‌ ఖాన్‌, నేతాజీ వెంట మృత్యువునుస్వీకరించిన హబీబుర్‌ రెహమాన్‌ లాింటి వీరపుత్రుల అరుదైన విశేషాలు ఈ గ్రంథంలో లభ్యమవుతాయి. నిరాయుధులుగా బ్రిీటిష్‌ పోలీసు బలగాలకు ఎదురు నిలచి అహింసా మార్గంలో ఆత్మార్పణలతో వాయవ్య సరిహద్దు రాష్ట్రాన్ని ఎరుపెక్కించి, ప్రపంచ అహింసోద్యమాల చరిత్రలో అగ్రస్థానం పొందిన ఖాన్‌ అబ్దుల్‌ గపార్‌ ఖాన్‌ 'ఖుదా-యే-ఖిద్మత్‌గార్‌' పరాన్‌ బిడ్డలు కనపడతారు.

బ్రిీటిషర్ల బానిసత్వం నుండి విముక్తి కోసం సుదీర్గ కాలంపాటు సాగిన స్వాతంత్య్ర సమరంలోని ప్రతి ఘట్టంలో తమ భాగస్వామ్యాన్ని అందించిన ముస్లిం యోధుల పాత్రను సంగ్రహంగా అందించిన, ఈ గ్రంథాన్ని రచయిత క్రింది వాక్యాలతో ముగించటం సమంజసంగా ఉంది. దేశ విభజన సమయంలో '.. ముస్లిం సంపన్న.వర్గాలలో అత్యధికులు భారత్‌ వదిలి వెళ్ళి పోయారు. కాని లౌకిక భారతంపై పరిపూర్ణ విస్వాసంతో కోట్లాది ముస్లింలు యిక్కడే ఉండిపోయారు. మాతృదేశం అభివృద్ధి, రక్షణకు సంబంధించిన పలు రంగాలతోపాటు దేశ ప్రతిష్టను యినుమడింపజేసే అనేక జీవన రంగాలలో విశేషమైన కృషి సల్పుతూ భారతీయ సమాజంలో అవిభాజ్యమై పోయారు. మౌలానాఅబుల్‌ కలాం ఆజాద్‌ మాటల్లో చెప్పాలంటే, ముస్లింలు లేని భారత చరిత్ర, సంసృతి,నాగరికత అసంపూర్ణం, అపరిపూర్ణం...'.

ఈ మాటలను అక్షరాల రుజుచేసేవిధంగా రచయిత సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఎంతో శ్రమకోర్చి, అపూర్వ పరిశోధన జరిపి, ఈ గ్రంథాన్ని ఒక అమూల్యమెన కానుకగా తెలుగువారికి అందాచేశారు. భారత స్వాతంత్య్ర సమరం చరిత్రకు సమగ్ర రూపం కల్పించడనికి ఇంకా ఎంత కృషి జరగాల్సి ఉందో ఈ పుస్తకం గుర్తు చేస్తుంది.స్వాతంత్య్రోద్యమ ఉజ్వల చరిత్రలో ముస్లింల పాత్ర గురించి గతంలోను, వరమానంలోను,భవిష్యత్తులోను పరిశోధన జరిపిన, జరుపుతున్న వారందరికీ ఈ గ్రంధం అమూల్యమైన ఆధారం కాగలదు. అంతటి మంచి పరిశోధానాత్మక పుస్తకాన్ని అంద చేసినందుకు స్వాతంత్య్ర సమరయోధుల అందరి పక్షాన, పరిశోథకుల తరఫున రచయిత శ్రీ నశీర్‌ ఆహమ్మద్‌ను అభినందిస్తున్నాను.


10