పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/12

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

స్వాతంత్ర్యం కోసంపోరాడటం అంతే తప్పనిసరి విధి...' అంటూ పోరుబాటన నడిచిన ఉలేమాల ప్రతినిధి మౌలానా అహమ్మద్‌, అగ్నియుగంగా ఖ్యాతిగాంచిన విప్లవోద్యమంలో పాల్గొని దాశాబ్దాల తరబడి ప్రవాస జీవితాలను గడపటమే కాకుండ ప్రప్రథామ ప్రవాస భారత ప్రభుత్వ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్‌ బర్కతుల్లా భోపాలి,యుగాంతర్‌ గ్రూపుకు చెందిన విపవకారుడు ఖుదీరాంకు ఆశ్రయం కల్పించి 'ఖుదీరాంకి దీది'గా ఖ్యాతిగాంచిన అజ్ఞాన యువతి, ఉరి కొయ్యలకు వెరవని అసమాన ధర్య వంతులు రసూలుల్లా ఖాన్‌, ఇంతియాజ్‌, భగత్‌ సింగ్ ఆదర్శప్రాయుడు, హిందు-ముస్లింల ఐక్యతా చిహ్నం అష్పాఖుల్లా ఖాన్‌ లాింటి అరుదైన విప్లవ వీర కిశోరాలు ఈ గ్రంధంలో పాఠకుడికి తారసపడతారు.

జాతీయోద్యామంలో భాగంగా సాగిన ఖిలాఫత్‌ పోరాటంలో ముందుకు నడిచిన అలీ సోదారులు, స్వాతంత్య్రం కంటే హిందూ-ముస్లింల ఐక్యత ప్రధానమన్నమౌలానా అబుల్‌ కలాం అజాద్‌, బ్రిీటిష్‌ పోలీసుల క్రౌర్యాన్ని పళ్ళబిగువున భరించి తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం డిమాండ్‌ చేసిన కమ్యూనిస్టు యోధుడు మౌలానా హస్రత్‌ మోహాని, జలియన్‌వాలాబాగ్ వీరుడిగా ఖ్యాతిగాంచిన డాక్టర్‌ సైపుద్దీన్‌ కిచ్లూ విముక్తి పోరాటంలో విలాసాలకు తావు ఉండరాదాంటూ సర్వస్వం ఉద్యమాలకు సమర్పించటమే కాకుండ గాంధీజీ దేశ పర్యటనకు నిధులు అందజేసిన వృద్ధ మాత 'బీబి అమ్మ'గా చిరస్మరణీయురాలైన అబాది బానో బేగం, నిషాతున్నీసా బేగం లాింటి పలు మహిళా రత్నాలు,క్విట్ ఇండియా' నినాదం సృష్టించిన యూసుఫ్‌ మోహరాలి, వందలాది విముక్తి పోరాట యోధులు తమ తమ విశిష్టమైన భూమికలతో దార్శనమిస్తారు. స్వరాజ్య సాధన మాత్రమే కాకుండ కార్మిక- కర్షక సంకే∆మం కోరుకుంటూ ఆ దిశగా కూడ సాగి పలు కుట్ర కేసులను ఎదుర్కొన్న షౌకత్‌ ఉస్మాని, ముజఫర్‌ అహమ్మద్‌, కవులు ఖాజీ నజ్రుల్‌ ఇస్లాం, సజ్జాద్‌ జహీర్‌, హజరా బేగం లాిం కమ్యూనిస్టు ఉద్యామకారుల సమాచారం ఉంది. నేతాజీ నాయకత్వంలో ప్రాణాలు తృణప్రాయంగా భావించి ఆజాద్‌ హింద్‌ ఫ్ధజ్‌లో ప్రముఖ పాత్ర వహించి, ' జైహింద్‌ ',నేతాజీ అను ప్రఖ్యాత పదాలను కాయిన్‌ చేసిన మన రాష్ట్రానికి చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రాని, పౌజ్ సేనాని జనరల్‌ 9