Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857 నాటి చారిత్రక పోరాటంలో అద్వితీయ పాత్ర పోషించిన ముస్లింల సాహసాలను, ఆ దశలో అరివీర భయంకరంగా పోరాడిన పలువురు యోధుల గురించే కాకుండ యోధరాండ్ర గురించి అమూల్య సమాచారం ఈ పుస్తకంలో లభిస్తుంది. ఆనాటి పోరాట యోధుల వీరోచిత గాధలు హృదయాలను కదల్చివేస్తాయి. చరిత్ర పుటలలో మరుగునపడన ఈ ఘట్టాలు రచయిత ఎంతో శ్రమించి అంవేషిస్తేగాని లభించే అవకాశం లేదు. ఈ పోరాటంలో భాగం పంచుకున్న పాత్రికేయుల ఘన చరిత్రను కూడ స్వయంగా జర్నలిస్టు అయిన నశీర్‌ వదిలి పెట్టలేదు . కంపెనీ పాలకుల దుశ్చర్యలను దుయ్యబడుతూ, తిరుగుబాటును ప్రోత్సహిస్తూ కలంతో రణం చేసి, జనరల్‌ హడ్సన్‌ తుపాకి గుండ్లకు బలైన 'ఢిల్లీ అక్బార్‌' సంపాదకుడు మౌల్వీ మహమ్మద్‌ బాకర్‌ గురించి సరికొత్త సమాచారాన్ని అందించారు. ఆయన బాటలో నడిచిన నిజాం రజాకారుల కరకు కత్తులకు బలైన, తెలుగు బిడ్డడు షోయాబుల్లా ఖాన్‌ను మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తారు. ప్రధమ స్వాతంత్య్ర సమరంలో బ్రిీటిష్‌ పాలకుల రికార్డులను బట్టే 27 వేల మంది ముస్లింలు ఊచకోతకు గురయ్యారన్న సమాచారం చదువుతుంటే కళ్ళనీళ్ళు తిరగకమానవు. ఈ పోరాటంలో వ్యక్తమైన హిందూ-ముస్లింల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు వలసపాలకులు ప్రజలను మత ప్రాతిపదికన విభజించి, చరిత్రను వక్రీకరించి రాసి, మత మనోభావాలను రంగం మీదకు తెచ్చి, విభజనకు బీజాలు నాటారని రచయిత వివరిస్తారు.

1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ అవిర్భావం నుండి స్వాతంత్య్రం సిద్ధించేంత వరకు ఈ గడ్డ బిడ్డలైన ముస్లిం జనసముదాయాల భాగస్వామ్యాన్నిఅందులో విశిష్ట భూమిక నిర్వహించిన త్యాగదనుల విశేషాలను పాఠకులకు పరిచయ ం చేసూందీ గ్రంథం.సామాన్య పాఠ్య గ్రంథాలు గాని, అందుబాటులో ఉన్న చరిత్ర గ్రంథాలలో గాని మనకు లభ్యంగాని అరుదైన సాహస ఘట్టాలను మన ముందు దృశ్శీకరించి పాఠకుడ్నితన వెంట తిప్పుకుంటూ, అలనాటి స్వాతంత్య్ర సమరయాధులందర్నిపరిచయం చేయటంలో రచయిత విజయం సాధించారు.

జాతీయ కాంగ్రెస్‌ స్థాపనలో, విస్తరణలో సహకరించిన బధ్రుద్దీన్‌ తయ్యాబ్జీ, రహిమతుల్లా సయాని నుంచి, '... నమాజ్‌ నాకు ఎంతటి విధి అయిందో, నా దేశ 8